Vijay Devarakonda: మాట నిలబెట్టుకున్న విజయ్‌! వందమంది ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ ట్రిప్‌ వీడియో వైరల్‌

Vijay Deverakonda Fulfill His Promise and Send 100 Fans Manali Trip - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండకు ఫ్యాన్‌ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంతో యూత్‌లో ఆయన విపరీతమైన క్రేజ్‌ ఉంది. సినిమాల కంటే కూడా తన ప్రవర్తనతోనే మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు విజయ్‌. హిట్‌..ప్లాఫ్‌తో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్‌ పాలోయింగ్‌ పెరుగుతూనే ఉంది. అలాగే విజయ్‌ కూడా తరచూ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు.

చదవండి: నాపై అలాంటి కామెంట్స్‌ చేశారు.. దానికి కారణం ఇదే: ఎస్వీ కృష్ణారెడ్డి

గత ఐదేళ్ల నుంచి ప్రతి క్రిస్మస్‌కు అభిమానులకు బహుమతులు అందిస్తున్నాడు ఈ టాలీవుడ్‌ సెన్సెషన్‌. దేవరశాంట పేరుతో ఒక్కో ఏడాది ఒక్కో కాన్సెప్ట్‌తో సర్‌ప్రైజ్‌ ఇస్తుంటాడు.  ఈ సారి మాత్రం 100 మంది ఫ్యాన్స్‌ని మనాలి విహారయాత్రకు పంపించనున్నట్లు ప్రకటించాడు. ఐదు రోజుల పాటు సాగే ఈ విహారయాత్రకు సంబంధించిన ఖర్చులన్నీ ఆయనే భరించనున్నాడు.

చదవండి: పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గని కాజల్‌ జోరు

ఇప్పటికే ఈ 100 మంది పేర్లు ప్రకటించిన విజయ్‌ ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఈ యాత్ర కొనసాగనుందని వెల్లడించాడు. ఇక శుక్రవారం (ఫిబ్రవరి 17న) వారి జర్నీ స్టార్ట్‌. ఈ సందర్భంగా ఫ్లైట్‌లో పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఫ్యాన్స్‌ పంపిన వీడియోని విజయ్‌ తన ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. ‘ఈ రోజు ఉదయం వాళ్లు ఫ్లైట్‌లో ఉన్న వీడియోను నాకు పంపించారు. పర్వతాల్లోకి హాలీడే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. దేశంలోని నలుమూలల నుంచీ 100 మంది ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది’ అంటూ విజయ్‌ రాసుకొచ్చాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top