పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గని కాజల్‌ జోరు | Buzz Is That Kajal Aggarwal Increased Her Remuneration | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal : పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గని కాజల్‌ జోరు

Published Sat, Feb 18 2023 3:11 PM | Last Updated on Sat, Feb 18 2023 3:36 PM

Buzz Is That Kajal Aggarwal Increased Her Remuneration - Sakshi

హీరోయిన్లకు పెళ్లి తర్వాత ఒక కెరీర్‌ అయిపోయినట్లే అని అపోహ ఉండేది. స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పినా పెళ్లి తర్వాత వదిన, అక్క పాత్రలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ పరిస్థితులు మారాయి. పెళ్లి తర్వాత కూడా ఇప్పటి హీరోయిన్లు దూసుకుపోతున్నారు. వారిలో కాజల్‌ అగర్వాల్‌ కూడా ఒకరు.

తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కాజల్‌ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తోంది. అయితే ప్రెగ్నెన్సీ టైంలోనే కాస్త బ్రేక్‌ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ యాక్షన్‌కు రెడీ అంటోంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో పాన్‌ ఇండియా సినిమాలు సైన్‌ చేసిన కాజల్‌ రెమ్యునరేషన్‌ కూడా భారీగా పెంచేసిందట.

ఒకప్పుడు సుమారు  కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకునే కాజల్‌ ఇప్పుడు దాదాపు మూడు కోట్లు రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తుందని టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం కాజల్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ఇండియన్‌-2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మరో రెండు తమిళ చిత్రాలు, బాలయ్య సరసన ఓ సినిమాలో నటిస్తుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement