వెంక‌టేశ్ 34 ఏళ్ల సినీ ప్ర‌యాణం

Victory Venkatesh Turns 34 Years In Tollywood Film Industry - Sakshi

టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్‌ నిర్మాత ద‌గ్గుబాటి రామానాయుడు వార‌సుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన‌ వెంక‌టేశ్ త‌న ప్ర‌తిభ‌తో ఎంతోమంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. అన్నిర‌కాల వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా వైవిద్య‌భ‌రిత‌మైన సినిమాలు చేస్తూ త‌న పేరు ముందు విక్ట‌రీని సుస్థిరం చేసుకున్నారు. ఆయ‌న వెండితెర‌పై త‌న ప్ర‌స్థానాన్ని మొద‌లు పెట్టి 34 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా సురేశ్ ప్రొడ‌క్షన్స్ శుక్ర‌వారం  ప్రత్యేక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. అందులో వెంక‌టేశ్ తాజాగా న‌టిస్తోన్న నారప్ప క్యారెక్ట‌ర్‌ను హైలెట్ చేసింది. (కేరాఫ్‌ నారప్ప)

వెంక‌టేశ్ న‌ట‌ప్ర‌స్థానాన్ని గ‌మ‌నిస్తే.. 1971లో ప్రేమ న‌గ‌ర్ సినిమాలో బాల‌న‌టుడిగా క‌నిపించారు. అనంత‌రం 1986లో 'క‌లియుగ పాండ‌వులు' చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వ‌గా, తొలి సినిమాకే నంది అవార్డును ద‌క్కించుకున్నారు. న‌టి ఖుష్బూకు ద‌క్షిణాదిన ఇదే తొలి సినిమా కావ‌డం విశేషం. రీమేక్ సినిమా 'చంటి'తో ఆయ‌న బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నారు. 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' వంటి సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

'ప్రేమించుకుందాం రా', 'సూర్యవంశం' ఆయ‌న ఎవ‌ర్‌గ్రీన్ చిత్రాలు. 'రాజా', 'క‌లిసుందాం రా', 'జ‌యం మ‌న‌దేరా', 'సంక్రాంతి', 'దృశ్యం'‌.. వంటి ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు ఆయ‌న ఖాతాలో ఉన్నాయి. మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు', 'ఎఫ్ 2', 'వెంకీమామ' అన్నీ కూడా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. 36 ఏళ్ల సినీ ప్ర‌యాణంలో వెంక‌టేశ్‌ ఉత్త‌మ న‌టుడిగా ఏడు సార్లు నంది అవార్డులు గెలుపొందారు. (వాటిని ప్రేమించాల్సిన స‌మ‌యం ఇదే..)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top