పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'వశిష్ఠ'మూవీ | Vasishta Movie Pooja Launch Program | Sakshi
Sakshi News home page

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'వశిష్ఠ'మూవీ

Nov 24 2024 5:43 PM | Updated on Nov 24 2024 5:43 PM

Vasishta Movie Pooja Launch Program

సుమన్ తేజ్, అను శ్రీ  హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా "వశిష్ఠ". ఈ చిత్రాన్ని బేబి నేహా సమర్పణలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్ పై నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్నారు. మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో దర్శకుడు హరీశ్ చావా రూపొందిస్తున్నారు. "వశిష్ఠ" మూవీ ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు టెలివిజన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా,  నిర్మాత లయన్ సాయివెంకట్ స్క్రిప్ట్ అందజేశారు. నటుడు గగన్ విహారి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. యాడ్ ఫిలింమేకర్ యమున కిషోర్ ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ చేశారు.

నిర్మాత లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ.. వశిష్ఠ పోస్టర్ చూస్తుంటే హనుమాన్ సినిమా గుర్తుకొస్తుంది. హనుమాన్ మూవీలాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. టాలెంటెడ్ టీమ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. వారందరిలో కాన్ఫిడెన్స్, సంతోషం కనిపిస్తోంది. వశిష్ఠ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.

నిర్మాత నోరి నాగప్రసాద్ మాట్లాడుతూ.. మా వశిష్ఠ చిత్రం ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. సాయివెంకట్ , నాగబాల సురేష్  అతిథులుగా వచ్చి బ్లెస్ చేశారు. పక్కా స్క్రిప్ట్ వర్క్ తో వశిష్ఠ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని అందించే సినిమా అవుతుంది. స్క్రిప్ట్ వినగానే మా హీరో సుమన్ తేజ్  చాలా హ్యాపీగా ఫీలయ్యారు. టీమ్ అంతా ఉత్సాహంగా వర్క్ చేస్తున్నాం. ఒక సక్సెస్ ఫుల్ మూవీతో మీ ముందుకు వస్తాం. మీడియా మిత్రుల సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.

డైరెక్టర్ హరీశ్ చావా మాట్లాడుతూ.. మా వశిష్ఠ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సోషల్ డ్రామా ఇది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. కథ వినగానే సింగిల్ సిట్టింగ్‌లో మా హీరో సుమన్ తేజ్  ఓకే చేశారు. మంచి టీమ్ నాకు సపోర్ట్ గా దొరికింది. మా ప్రొడ్యూసర్ నాగ ప్రసాద్ నాకు వెన్నంటే ఉన్నారు. ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తాం. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement