Varun Dhawan Emotional Tribute To His Driver Manoj Sahoo: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు. ఇది చూసిన వరుణ్ అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల వరుణ్ డ్రైవర్ మనోజ్ సాహు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. మనోజ్‌కు నివాళిగా తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు వరుణ్. బీచ్‌లో లవ్ షేప్‌లో ఇసుకను పేర్చి అందులో 'మనోజ్ భాయ్ మిస్ యూ సోమచ్' అని రాశాడు.
ఈ స్టోరీకి 'అందంగా ఉంది. మనోజ్ భాయ్ స్వర్గం నుంచి ఇది చూసి చిరునవ్వు చిందిస్తాడు.' అని ఒక అభిమాని కామెంట్ పెట్టగా 'ఈ పోస్ట్‌తో మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారు. దేవుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలి.' అని మరొకరు రాశారు. వరుణ్‌తో 26 ఏళ్లపాటు కలిసున్న మనోజ్ సాహు మంగళవారం గుండెపోటుతో మరణించారు. వరుణ్ వెళ్లిన ఒక యాడ్ షూట్‌కు తీసుకెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది.



