కొత్త సినిమా స్టార్ట్‌ చేసిన మెగాహీరో

Vaishnav Tej Starts His New Movie Shooting In Hyderabad - Sakshi

‘ఉప్పెన’ ఫేమ్‌ వైషవ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో స్టార్ట్‌ అయ్యింది. ‘అర్జున్‌ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను తెరకెక్కింన గిరీశాయ ఈ త్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్‌ మంగళవారం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ఉప్పెన’తో యువతకు దగ్గరైన వైష్ణవ్‌ తేజ్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసే కథతో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నాం. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా శిష్యుడు గిరీశాయ ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు’ అని అన్నారు. కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top