Panja Vaishnav Tej: I Don't Have Any Instagram, Social Media Accounts, Avoid to Follow Fake Accounts- Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో నాకు అకౌంట్లు లేవు: 'ఉప్పెన' హీరో‌

Mar 22 2021 8:52 AM | Updated on Mar 22 2021 12:45 PM

Vaishnav Tej Gives Clarity On Fake Social Media Accounts - Sakshi

‘‘సోషల్‌ మీడియాలో నాకు ఎలాంటి అధికారిక అకౌంట్స్‌ లేవు. నా పేరుతో ఉన్న ఫేక్‌ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను దయచేసి ఎవరూ ఫాలో కావొద్దు’’ అని హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి నా పేరుతో ఫేక్‌ అకౌంట్లు సృష్టించి ఉపయోగిస్తున్నారు’’ అన్నారు వైష్ణవ్‌. తొలి చిత్రం ‘ఉప్పెన’తో ఘనవిజయం అందుకున్న వైష్ణవ్‌ తేజ్‌ ద్వితీయ చిత్రాన్ని క్రిష్‌ దర్శకత్వంలో చేస్తున్నారు.

కాగా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా, కృతీశెట్టి హీరోయిన్‌గా నటించిన ఉప్పెన సినిమా ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం వంద కోట్ల మైలురాయిని అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో సినిమా యూనిట్‌ విజయోత్సవ సంబరాలు కూడా జరుపుకుంది.

చదవండి: రంగ్‌దే ప్రీ రిలీజ్‌: చీఫ్‌‌ గెస్ట్‌గా త్రివిక్రమ్‌, కారణం అదేనట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement