బర్త్‌డేకి బంగారపు కేకు కట్‌ చేసిన హీరోయిన్‌.. ఫోటోలు వైరల్‌ | Sakshi
Sakshi News home page

బర్త్‌డేకి బంగారపు కేకు కట్‌ చేసిన హీరోయిన్‌.. ఫోటోలు వైరల్‌

Published Sun, Feb 25 2024 12:04 PM

Urvashi Rautela Cuts 24 Karat Gold Cake For Her Birthday - Sakshi

సినీ సెలెబ్రిటీలు ఏ పని చేసినా కాస్త డిఫరెంట్‌గానే ఉంటుంది. వాళ్లు ధరించే దుస్తులు, మాట్లాడే తీరు.. వ్యవహార శైలీ అన్ని ఇతరుల కంటే కాస్త భిన్నంగానే ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం తమ జీవనాన్ని సాదాసీదాగా కొనసాగిస్తే.. మరికొంత మంది మాత్రం చాలా రిచ్‌గా గడుపుతారు. రిచ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేసే వాళ్లలో ఊర్వశీ రౌతేలా ఒకరు.


(Image Courtesy:Instagram)

ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ఆమె ఎవరో గుర్తుకు రాకపోవచ్చు కానీ.. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’లోని ‘బాస్‌ పార్టీ’ పాటకు స్టెప్పులేసిన భామ అనగానే అందరికి గుర్తొస్తుంది. ఆ పాటకు తనదైన స్టెప్పులేని అందరిని ఆకట్టుకుంది ఈ భామ. నేడు(ఫిబ్రవరి 25) ఊర్వశి బర్త్‌డే. ఈ సందర్భంగా గొల్డెన్‌ కేక్‌ కట్‌ చేసి వార్తల్లో నిలిచింది ఈ బాలీవుడ్‌ భామ. 


(Image Courtesy:Instagram)

ప్రతి ఏడాది తన పుట్టిన రోజు వేడుకను చాలా గ్రాండ్‌గా జరుపుకోవడం ఊర్వశికీ అలవాటు. అలా ఈ ఏడాది కూడా తన బర్త్‌డేని స్నేహితుల సమక్షంగా గ్రాండ్‌గా సెలెబ్రేట్‌ చేసుకుంది. 24 క్యారెట్ల బంగారపు పూత పూసిన కేకును కట్‌ చేసి.. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇప్పుడా ఫోటోలు వైరల్‌గా మారాయి. తినే కేకుకు బంగారపు పూత పూయడం అవసరమా? ఎంత డబ్బులు ఉన్నా.. బంగారంతో కేకును తయారు చేస్తారా? అవి డబ్బులా మంచి నీళ్లా? అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 


(Image Courtesy:Instagram)

 
Advertisement
 
Advertisement