UI Teaser: ఇలాంటి టీజర్ నెవ్వర్ బిఫోర్.. ప్రేక్షకులకే పరీక్ష పెట్టారు!

Upendra UI Movie Teaser Telugu Review - Sakshi

ఉపేంద్ర.. ఇప్పటిజనరేషన్‌కి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90స్ కిడ్స్‌ని అడిగితే ఈ హీరో గురించి కథలు కథలుగా చెబుతారు. ఎందుకంటే సినిమా అంటే అలానే ఉండాలి, ఇలానే తీయాలి అనే రూల్స్ పెట్టుకోకుండా తీసిన వన్ అండ్ ఓన్లీ హీరో కమ్ డైరెక్టర్ ఉపేంద్ర. చాన్నాళ్లుగా దర్శకత్వాన్ని పక్కనపెట్టిన ఇతడు.. ఓ క్రేజీ మూవీతో ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చేస్తున్నాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా, అది విచిత్రంగా ఉంది.

డిఫరెంట్ టీజర్
సాధారణంగా స్టార్ హీరో సినిమాల టీజర్, ట్రైలర్.. ఏదైనా సరే ఎలివేషన్స్, ఊరమాస్ డైలాగ్స్ లాంటివి ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. కానీ ఉపేంద్ర కొత్త మూవీ 'UI' టీజర్ మాత్రం అలా అస్సలు లేదు. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక్కటంటే ఒక్క విజువల్ లేకుండా 137 సెకన్ల టీజర్ రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోలో కేవలం సౌండ్ మాత్రమే వినబడుతూ ఉంటుంది కాబట్టి మీరు కళ్లు మూసుకుని ఈ టీజర్ చూడాల్సి ఉంటుంది. ఇదే ఇక్కడ విశేషం.

(ఇదీ చదవండి: పెళ్లికి ముందే అత్తారింట్లో మెగా కోడలు సందడి)

టీజర్‌లో ఏముంది?
చీకటి అంతా చీకటి, అసలు ఇది ఎలాంటి చోటు అని ఉపేంద్ర వాయిస్‌తో టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత నీళ్ల శబ్దం, గుర్రం పరుగెత్తడం, ఆకలి అని కొందరు మనుషులు ఆర్తనాదాలు పెట్టడం, తలుపు తెరుచుకోవడం, పావురం రెక్కల్ని టపటప కొట్టుకుని పైకి ఎగరడం, పరుగెత్తుకుంటూ వెళ్లి ఓ మనిషి చనిపోవడం, వెలుతురు పడ్డ, సౌండ్ వినిపించినా ఎటాక్ చేస్తారని ఉపేంద్ర వాయిస్ తనకి తానే చెప్పుకోవడం, ఓ గొట్టం కింద పడటం, కొందరి మధ్య ఫైట్ జరగడం లాంటి సౌండ్స్ ఈ టీజర్ లో వినిపించాయి. 

అయితే ఈ టీజర్ చూడాలంటే కళ్లు తెరిచి కాదు మూసుకుని చూడాల్సి ఉంటుంది. అప్పుడే ఆ సీన్స్ ఏంటనేవి ఎవరి ఊహకి తగ్గట్లు వాళ్లకు మైండ్‌లో విజువలైజ్ అవుతాయి. ఇప్పటివరకు ఇలాంటి టీజర్ అయితే సినీ చరిత్రలో ఇప్పటివరకు రాలేదన చెప్పొచ్చు. టీజరే ఇలా ఉందంటే.. సినిమా ఇంకెలా ఉండబోతుందో అని అంచనాలు పెరుగుతున్నాయి. 

(ఇదీ చదవండి: యువ హీరో తల్లిపై పోలీస్ కేసు.. ఏం జరిగింది?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top