Kashmir: TV Artist Amreen Bhat Shot Dead By Terrorists In Budgam - Sakshi
Sakshi News home page

Kashmir TV Artist Amreen Bhat: విషాదం.. ఉగ్రవాదుల కాల్పుల్లో టీవీ నటి కన్నుమూత

May 26 2022 6:55 AM | Updated on May 26 2022 9:07 AM

TV Artist Amreen Bhat Shot Dead By Terrorists In Kashimr - Sakshi

TV Artist Amreen Bhat Dead.. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకాశ్మీర్‌లో బుధవారం రాత్రి వరుస ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో టీవీ నటిని కాల్చి చంపడం కలకలం రేపింది. ఉగ్రదాడుల్లో ఆమె మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు. 

వివరాల ప్రకారం.. బూద్గామ్‌ జిల్లాలో సామాన్య పౌరుల ఇళ్లను టార్గెట్‌ చేసి కాల్పులకు తెగబడ్డారు. కాగా, బుధవారం రాత్రి.. ఇంట్లో ఉన్న టీవీ నటి అమ్రీన్‌ భట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 
ఈ ఘటనలో ఆమె పదేళ్ల మేనల్లుడు ఫర్హాన్‌ జుబీర్‌కు కూడా బుల్లెట్‌ గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. 

ఇదిలా ఉండగా..  నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులే ఈ దాడులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్చలు చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు.. 24గంటల వ్యవధిలోనే కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. 

ఇది కూడా చదవండి: లైఫ్‌లో కాంప్రమైజ్‌ అయ్యేదే లేదు: నాగచైతన్య

Advertisement
 
Advertisement
Advertisement