నిన్ను టీవీలోనే చాలామంది చూశారు.. ఇంకా ఓటీటీలో కష్టమే అన్నారు | TV Actress Urvashi Dholakia Says She Won't Do Negative Role Again | Sakshi
Sakshi News home page

15 ఏళ్లయినా అదే గుర్తింపు.. ఇకపై అలాంటి పాత్రలు చేయను: బుల్లితెర నటి

Jun 10 2024 3:59 PM | Updated on Jun 10 2024 5:38 PM

TV Actress Urvashi Dholakia Says She Wont do Negative Role Again

కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా కసౌటీ జిందగీ కే సీరియల్‌లో కోమలిక అనే నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర పోషించి గుర్తింపు పొందింది ఊర్వశి ఢోలకియా. ఈ సీరియల్‌ వచ్చి దాదాపు 15 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆమెను కోమలికగానే ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. తాజాగా ఆమె దీని గురించి మాట్లాడుతూ.. 'ఇప్పటికీ జనాలు నన్ను కోమలిక అనే పిలుస్తారు. ఆ ఒక్క పాత్రను మాత్రమే గుర్తుపెట్టుకున్నారంటే నేను వేరే సీరియల్స్‌ ఏమీ చేయలేనని కాదు! నా విషయంలో దర్శకులు, నిర్మాతల క్రియేటివిటీ ఏమైపోయిందోనని అర్థం! 

ఇకపై అలాంటివి చేయను
ఎన్నో పాత్రలు పోషించాను కానీ వాటికంత గుర్తింపు రాకుండా పోయింది. ఒకే రకమైన పాత్రలు చేసి బోర్‌ కొడుతోంది. ఇకపై నెగెటివ్‌ రోల్స్‌ చేయను. ప్రస్తుతం న్యాయవాదిగా పాజిటివ్‌ రోల్‌ చేస్తున్నాను. అందుకు సంతోషంగా ఉంది. ఇక మీదట కూడా ఇలాంటివే చేయాలనుంది. ప్రేక్షకులు ఊహించని పాత్రల్లో కనిపించాలనుంది. ఓటీటీల విషయానికి వస్తే ఇప్పుడు దానికి చాలా క్రేజ్‌ ఉంది. కానీ గతేడాది ఈ ప్లాట్‌ఫామ్‌లో నన్ను తిరస్కరించారు. 

ఓటీటీలు నన్ను పక్కన పెట్టేశాయి
నిన్ను టీవీలోనే చాలామంది చూసేశారు.. అని ఛాన్స్‌ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. అసలు ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో టీవీ సెలబ్రిటీలే లేరా? అంతటా ఉన్నారు.. మరి ఎందుకని నన్ను అలా చిన్నచూపు చూశారని బాధేసింది. అయినా నాకు ఓటీటీల నుంచి ఎటువంటి మంచి ఛాన్సులు రావడం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా ఊర్వశి ప్రస్తుతం పుష్ప ఇంపాజిబుల్‌ అనే సీరియల్‌ చేస్తోంది. అందులో లాయర్‌ దేవి సింగ్‌ శిఖావత్‌గా నటిస్తోంది. 

చదవండి: ఆ డైరెక్టర్‌ నన్ను పనిమనిషిలా చూశాడు.. అందరిముందు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement