గ్రాండ్‌గా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మనవరాలి పెళ్లి | tollywood producer Vrk Rao Grand Children Marriage at hyderabad | Sakshi
Sakshi News home page

VRK Rao: టాలీవుడ్ నిర్మాత మనవరాలి పెళ్లి.. సినీతారల సందడి

May 4 2026 9:03 PM | Updated on May 4 2026 9:03 PM

tollywood producer Vrk Rao Grand Children Marriage at hyderabad

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వీఆర్‌కే రావు ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన మనవరాలు హిమశ్రీ వేమూరి వివాహా వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుక జన్వాడలోని నియో కన్వెన్షన్‌లో జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకలో కేఎస్ రామారావు, శివాజీ రాజా, సాయికుమార్, అశోక్ కుమార్, రాజీవ్ కనకాల, శివబాలాజీ-మధుమిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, యాంకర్ శిల్పా చక్రవర్తి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సందడి చేశారు.

కాగా.. వీఆర్‌కే రావు భారత వైమానిక దళంలో కమాండర్‌గా పనిచేశారు. వీఆర్కే రావు కేవలం ఒక సైనికుడిగానే కాకుండా సమాజ సేవకుడిగా.. కళాకారుడిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి  ఉత్తమ కమాండర్ అవార్డు అందుకున్నారు. నిర్మాతగా బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేశారు. వరకట్నం, అవినీతి వంటి సామాజిక రుగ్మతలపై ఆయన తీసిన సందేశాత్మక చిత్రాలు అనేక ప్రతిష్టాత్మక నంది అవార్డులను కొల్లగొట్టాయి. శివాజీ రాజా హీరోగా తెరకెక్కిన 'మొగుడ్స్ పెళ్లామ్స్' చిత్రంతో నిర్మాతగా మరో నంది అవార్డ్ అందుకున్నారు. అజైల్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ఆయన అందించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement