నా జీతం రూ.2700.. ఆల్టో కారు మాత్రమే తెలుసు: టాలీవుడ్ నిర్మాత | Tollywood Producer SKN Comments about His Career | Sakshi
Sakshi News home page

SKN: 'సినిమా టికెట్‌ కొనాలంటే కూడా ఆలోచించేవాడిని'.. నిర్మాత ఎస్‌కేఎన్

Mar 31 2026 7:04 AM | Updated on Mar 31 2026 9:30 AM

Tollywood Producer SKN Comments about His Career

టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. లైఫ్‌ నా ఎదుగుదలకు సహకరించిన వారిని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. నాకు వెంటవెంటనే సినిమాలు చేయడం అలవాటు లేదన్నారు. 2012లో ఈ రోజుల్లో మూవీ, 2018లో టాక్సీవాలా, 2023లో బేబీ చేశానని తెలిపారు. నిర్మాత ఎక్కువ  సినిమాలు చేయాలంటే నాకు భయమని వెల్లడించారు.

నా కెరీర్‌ ప్రారంభంలో కేవలం రూ.2700 జీతానికి పని చేశానని ఎస్‌కేఎన్ తెలిపారు. నన్ను నిర్మాతగా తీర్చిదిద్దింది డైరెక్టర్ మారుతీ అని వెల్లడించారు. మారుతీ, స్వివ్ట్, ఆల్టో వంటి కార్లు తప్ప వేరే కార్ తెలీని నాకు బెంజ్ కార్ కొనుక్కునేలా చేసిన డైరెక్టర్ సాయి రాజేశ్ అని అన్నారు. వాడు లేకుండా నేను ఏది చేయను అని చెప్పే వాళ్లలో నా తమ్ముడు లాంటి వ్యక్తి రవి నంబూరి అని తెలిపారు. వీళ్లందరి సహకారం వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానని.. లేదంటే ఇలాంటి సినిమా థియేటర్‌లో టికెట్ కొనాలంటే కూడా ఆలోచించే కుటుంబం మాది అని అన్నారు. బేబీ సూపర్ హిట్ తర్వాత మరో సినిమాతో మీ ముందుకొస్తున్నామన్నారు. తాజాగా నిర్మించిన చెన్నై లవ్‌ స్టోరీ మూవీ ఈవెంట్‌లో ఎస్‌కేఎన్ మాట్లాడారు.

కాగా.. కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన లవ్‌స్టోరీ సినిమా చెన్నై లవ్‌ స్టోరీ. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్‌కేఎన్ , సాయిరాజేశ్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలోని గుర్తుందా...అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను డాల్బీ ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement