
టాలీవుడ్ నిర్మాత సి కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ కార్మికులతో వివాదం కొనసాగుతున్న వేళ కొంతమంది నిర్మాతలు అలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. వేతనాల పెంపు అంశంపై ప్రభుత్వ జోక్యం అవసరం లేదని తెలిపారు. సినీ పెద్దలు ఈ సమస్యను పరిష్కరిస్తారని అన్నారు.
అలాగే సినీ కార్మికులను ఉద్దేశించి నిర్మాతలు ఎలా పడితే అలా మాట్లాడొద్దని కల్యాణ్ సూచించారు. కార్మికుల్లో నైపుణ్యం లేదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. సినిమా వాళ్లకు ప్రభుత్వాలతో పనిలేదని.. కేవలం టికెట్ ధర పెంపు కోసమే ప్రభుత్వాలను నిర్మాతలు సంప్రదిస్తారని వెల్లడించారు. ప్రభుత్వాలతో పని ఉంటే వ్యక్తిగతంగా వెళ్లి కలుస్తామని నిర్మాత కల్యాణ్ తెలిపారు.
కాగా.. సినీ కార్మికుల ఫెడరేషన్కు, తెలుగు చిత్ర నిర్మాతలకు మధ్య వివాదం కొనసాగుతోంది. 30 శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మికుల యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని తెలుగు చిత్రం నిర్మాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా షూటింగ్ బంద్ కొనసాగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే నిర్మాతలు మెగాస్టార్ను కలిసి సమస్యను వివరించారు.