ఇంతకీ ‘మ్యాటరేంటంటే!’

Tollywood actresses practice yoga during lockdown - Sakshi

స్కూల్‌కి వెళ్లేటప్పుడు క్లాస్‌మేట్స్‌ కావాలి. చదివింది షేర్‌ చేసుకోవడానికి.. అల్లరి పనులు చేయడానికి.  పనిలో ఉన్నప్పుడు ఆఫీస్‌ మేట్స్‌ కావాలి పని పంచుకొని ఒత్తిడి తగ్గించుకోవడానికి.  సినిమా విషయానికి వస్తే గ్రీన్‌మ్యాట్‌ కావాలి  గ్రాఫిక్స్‌ ద్వారా కష్టాన్ని తగ్గించుకోవడానికి.  గ్లామర్‌ ఇండస్ట్రీలో వాళ్లకు యోగా మ్యాట్‌ కూడా కావాలి  ఫిట్‌నెస్‌ పెంచుకోవడానికి.  ఇంతకీ ‘మ్యాటరేంటంటే!’ మ్యాటర్‌ చదవండి.. అర్థమైపోతుంది.

కరోనా వల్ల ఎవ్వరం ఇంట్లో నుంచి కాలు కదపడానికి లేదు. ఫిట్‌నెస్‌ ప్రియులకు ఇది కాళ్లు కట్టేయడంలాంటిదే. కానీ హీరోయిన్లు ఫిట్‌గా ఉండాలి. ఫిట్‌నెస్‌ని అశ్రద్ధ చేయకూడదు. ఫిట్‌గా స్క్రీన్‌ మీద కనిపించాలి. అందుకే నోరు కట్టేస్తూ, జిమ్‌ చుట్టేస్తారు. ఇప్పుడు ఈ కరోనా సమయంలో జిమ్‌ సెంటర్‌ కి వెళితే రిస్క్‌ని వర్కవుట్‌ తో తెచ్చుకునే ప్రమాదం ఉంది. అందుకే ఈ మధ్య అందాల తారలు ఎక్కువగా ‘యోగా మ్యాట్‌’తో ఫ్రెండ్‌ షిప్‌ చేస్తున్నారు.

మ్యాట్‌రేంటంటే ... హీరోయిన్లందరూ తరచూ యోగాసనాలు చేస్తూ ఫోటోలను షేర్‌ చేస్తున్నారు. అయితే క్లిష్టమైనవి నేర్చుకోవాలంటే కాస్త టైమ్‌ పడుతుంది. ఈ కరోనా లాక్‌ డౌన్‌ హీరోయిన్లకు కావాల్సినంత సమయాన్ని ఇచ్చింది. దీంతో కొత్త ఆసనాలు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. కొందరు టార్గెట్‌ ను చేరుకున్నారు. మరికొందరు చేరుకుంటున్నారు. మ్యాట్‌ మీద ఫీట్‌లు చేస్తున్న హీరోయిన్ల విషయానికి వస్తే.. ‘లాక్‌ డౌన్‌లో గార్డెనింగ్‌తో పాటు యోగాను బాగా ఆస్వాదిస్తున్నా’ అని సమంత తెలిపారు.

యోగాసనాల్లో అతి క్లిష్టమైన మయూరాసనం వేయాలనే లక్ష్యాన్ని చేరుకోగలిగారు సమంత. రకుల్‌కు ఫిట్‌నెస్‌ మీద ఎంత శ్రద్ధో అందరికీ తెలిసిందే. యోగా కేవలం శరీరానికి సంబంధించింది కాదు మనసుకు, మన జీవిత విధానానికి సంబంధించింది అంటారామె. ‘వర్కౌట్‌లో క్రమం తప్పేది లేదు’ అంటున్నారు తమన్నా. ఎప్పటికప్పుడు వర్కౌట్‌ ఫోటోలతో అభిమానులనూ వర్కౌట్‌ చేసేలా ప్రోత్సహిస్తున్నారామె. ధనురాసనం నేర్చేసుకున్నారట పూజా హెగ్డే. ‘యోగా చేస్తే తెలియని సంతోషం’ అంటున్నారు పూజ. ‘ఇంట్లో వీలయ్యే వర్కౌట్స్‌ చేయండి.. నేను చేస్తున్నా’ అంటారు రాశీ ఖన్నా. అదా శర్మ, తాప్సీ తదితరులు కూడా వర్కౌట్స్‌తో సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top