బెంగళూరు రేవ్‌ పార్టీ.. జైలు నుంచి హేమ విడుదల | Tollywood Actress Hema Gets Bail, Released From Bangalore Jail | Sakshi
Sakshi News home page

Hema: బెంగళూరు రేవ్‌ పార్టీ.. బెయిల్‌పై బయటకొచ్చిన హేమ

Jun 14 2024 4:17 PM | Updated on Jun 14 2024 4:38 PM

Tollywood Actress Hema Gets Bail, Released From Bangalore Jail

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో నటి హేమ ఇవాళ విడుదలయ్యారు. ఈ కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ లభించడంతో కొద్దిసేపటి క్రితమే జైలు నుంచి బయటికి వచ్చారు. కాగా..  బెంగళూరు నగర శివార్లలో జరిగిన రేవ్‌పార్టీలో హేమ  మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నటి హేమ బెయిల్ కోసం పిటిషన్‌ వేయగా స్థానిక కోర్టు‌ మంజూరు చేసింది.

hena

నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు. అంతేకాకుండా హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని  కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. అయితే, హేమ రేవ్‌ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement