Sai Dharam Tej Accident: వారి వల్లే సాయికి ప్రాణాపాయం తప్పింది

These Two People Helped Sai Dharam Tej In Road Accident - Sakshi

సరైన సమయంలో చికిత్స అందడం వల్లే సాయి ధరమ్‌ తేజ్‌కు ప్రాణాపాయం తప్పిందని తేజ్‌కు మొదట ట్రీట్‌మెంట్‌ చేసిన మెడికవర్‌ వైద్యులు తెలిపిన విషయం విధితమే. గోల్డెన్ అవర్‌లో అతన్ని ఆస్పత్రికి తీసుకురావడం, ఆ టైమ్‌లో ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ వల్లే సాయి తేజ్‌ ప్రాణాలతో బయటపడ్డారన్నారు. 108 సిబ్బంది సమయానికి అతన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. అంతేగాక ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో సాయి తేజ్‌కి ఫిట్స్ రాగా, వెంటనే స్పందించిన వైద్యులు అతనికి ఇంజెక్షన్లు ఇవ్వటంతో.. తదుపరి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు మెడికోవర్‌ వైద్యులు మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే.

చదవండి: Sai Dharam Tej Accident: సాయి తేజ్‌ వాడిన బైక్‌ ఏంటి? ధర ఎంత?

అయితే శుక్రవారం సాయంత్రం కెబుల్‌ బ్రిడ్జీ మీదుగా ఐకియా వైపు వెళ్తుండగా సాయి ఈ ప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108కు కాల్‌ చేసి తేజ్‌ ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడటంలో కీలక పాత్ర పోషించిన ఎవరో తెలుసా! ఆ అతడు ఓ సెక్యూరిటీగార్డ్‌. పేరు అబ్దుల్‌. అమీర్‌పెట ఎల్లారెడ్డిగూడకు చెందిన అబ్దుల్‌ నిజాంపేట క్రాస్‌రోడ్డులో కొత్తగా ప్రారంభమైన సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో వ్యాలెట్‌ పార్కింగ్‌ చేస్తుంటాడట.

చదవండి: ఆ కడుపు కోత నాకు తెలుసు: బాబు మోహన్‌ భావోద్వేగం

ఈ క్రమంలో శుక్రవారం విధులకు కెబుల్‌ బ్రిడ్జ్‌ మీదుగా హైటెక్ సిటీ మార్గం గుండా బైక్‌పై వెళుతున్నాడు. అదే సమయంలో ఐకియా సమీపంలో సాయి ప్రమాదవశాత్తూ కిందపడటంతో అది చూసిన అబ్దుల్‌ వెంటనే బండి పక్కన ఆపి హుటాహుటిన సాయి దగ్గరకు వెళ్లాడు. ఆ వెంటనే 108, 100కు డయల్‌ చేసి సమాచారం అందించాడు. 10 నిమిషాల్లో అంబులెన్స్‌ రావడం దగ్గర్లోని మెడికోవర్‌ ఆస్పత్రికి తరలించడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే అబ్దుల్‌ అంబులెన్స్‌లో సాయితో పాటు ఆస్పత్రికి కూడా వెళ్లినట్లు సమాచారం.

చదవండి: నరేశ్ కామెంట్స్‌ నాకు ఇబ్బందిగా అనిపించాయి: శ్రీకాంత్‌

అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతానికి కాస్త దూరంలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇస్లావత్ గోవింద్ కూడా సకాలంలో స్పందించాడు. సమాచారం అందిన వెంటనే.. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయటం.. అంబులెన్సు సకాలంలో ఆసుపత్రికి చేరటంలో సాయం చేశారు. అంబులెన్సులో మెడికవర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పుడు మాత్రమే అత‌ను హీరో సాయి తేజ్ అని అతడికి తెలిసిందట. ఏదేమైన వారు స‌కాలంలో స్పందించడం వ‌ల‌నే ఈ రోజు సాయి తేజ్ సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top