Sai Dharam Tej-Road Accident: సాయి రాష్‌గా వెళ్లే వ్యక్తి కాదు: నటుడు శ్రీకాంత్‌

Srikantha Respond On Sai Dharam Tej Accident And Oppose Naresh Comments - Sakshi

Srikanth Comments On Sai Dharam Tej Accident: మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై పలువురు సినీనటీనటులు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నటుడు నరేశ్‌ చేసిన కామెంట్స్‌ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాయి ధరమ్‌ తేజ్‌ తన కొడుకు నవీన్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరగడానికి ముందు సాయి, నవీన్‌ తమ ఇంటి నుంచే ఇద్దరూ కలిసి బయలుదేరారని, బైక్‌పై వద్దని చెబుదామనుకున్నా కానీ ఆలోపే వెళ్లిపోయారన్నాడు.

అంతేగాక తన కుమారుడు, సాయి తరచూ బైక్‌ రేసులో పాల్గొంటారని చెప్పాడు. దీంతో నరేశ్‌ వ్యాఖ్యలను తప్పు బడుతూ పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. విషయం పూర్తిగా తెలుసుకోకుండానే ఎందుకు మాట్లాడతారని అంటున్నారు. ఇప్పటికే నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ ఈ సమయంలో రాజకీయాలు చేయొద్దంటూ సోషల్‌ మీడియాలో వీడియో వదలగా.. తాజా హీరో శ్రీకాంత్‌ సైతం అభ్యంతరం వ్యక్తం చేశాడు.

చదవండి: నరేశ్‌ వ్యాఖ్యలపై బండ్ల గణేశ్‌ అభ్యంతరం

నరేశ్‌ వ్యాఖ్యలపై శ్రీకాంత్‌ స్పందిస్తూ.. ‘సాయి ధరమ్‌ తేజ్‌కు జరిగిన యాక్సిడెంట్‌ చాలా చిన్నది. రోడ్డుపై ఇసుక ఉండటం వల్లే అతడి బైక్‌ స్కిడ్‌ అయ్యింది. సాయి ధరమ్‌ తేజ్‌ రాష్‌గా వెళ్లే వ్యక్తి కాదు. నరేశ్‌ పెట్టిన వీడియో బైట్‌ నాకెందుకో ఇబ్బందిగా అనిపించింది. కుటుంబ సభ్యులంతా టెన్షన్‌ పడుతుంటారు. ఈ సమయంలో ఆయన చనిపోయిన వాళ్ల గురించి ప్రస్తావించకుండా ఉంటే బాగుండేది. దయ చేసి ఎవరూ ఇలాంటి బైట్స్‌ పెట్టొద్దని కోరుకుంటున్నా’అని అన్నాడు. కాగా నరేశ్‌ వేగం విషయంలో యువత కంట్రోల్‌లో ఉండాలని, కోటా శ్రీనివాస రావు, బాబు మోహన్‌, కోమటి రెడ్డిల కుమారులు ఇలాగే ప్రమాదాల్లో మరణించి వారి కటుంబాలను శోక సంద్రంలో ముంచారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

చదవండి: Sai Dharam Tej's Accident : సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదంపై స్పందించిన నరేశ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top