
నేటితో(జూన్ 2) తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. 21 రోజుల పాటు రోజుకో రంగం చొప్పున ప్రత్యేక కార్యక్రమాలతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా దశాబ్ది ఉత్సవాలను జరుపుతున్నాయి.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ట్విటర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశాడు.
తెలంగాణ స్టేట్ form అయ్యి 10 years అవుతుంది. ఈ పదేళ్లలో we have made progress in all fields. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. Decade celebrations sandarbhamgaa, తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు#తెలంగాణదశాబ్దిఉత్సవాలు…
— Ram Charan (@AlwaysRamCharan) June 2, 2023