Actress Deepa: విషాదం.. సూసైడ్‌ నోట్‌ రాసి యువ నటి ఆత్మహత్య!

Tamil Actress Deepa Alias powlen Committed Suicide In Chennai - Sakshi

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కోలీవుడ్‌కు చెందిన యంగ్‌ నటి దీప అలియాస్‌ పౌలిన్‌(29) ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని విరుగంబాక్కంలోని ఓ ప్రైవేట్ ఫ్లాట్‌లో ఉంటున్న దీప శనివారం తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న దీప..మానసిన ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని స్నేహితులు చెబుతున్నారు.

దీప సంప్రదించడానికి ఆమె కుటుంబసభ్యులు ఫోన్ చేయగా.. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె స్నేహితుడు ఫ్లాట్‌కి వెళ్లి చూడగా..ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్‌ నోట్‌ లభించినట్లు తెలుస్తోంది. అందులో తన చావుకు ఎవరు కారణం కాదని చెబుతూనే జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటా అని రాసుకొచ్చింది. అయితే అతని పేరు మాత్రం ప్రస్తావించనట్లు సమాచారం. 

కాగా, పలు తమిళ సినిమాల్లో సహాయ నటిగా అలరించింది దీప. చిన్న పాత్రలు పోషించినా.. తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం విశాల్ నటించిన తుప్పరివాలన్ చిత్రంలో దీపా పౌలిన్ సేవకురాలిగా నటిస్తోంది.నాజర్ నటించిన వైదా చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top