అందుకే మా కెమిస్ట్రీ కుదిరింది!: తమన్నా | Tamannaah About Aranmanai 4 Movie | Sakshi
Sakshi News home page

అందుకే మా కెమిస్ట్రీ కుదిరింది!: తమన్నా

Published Wed, Jun 5 2024 12:03 AM | Last Updated on Wed, Jun 5 2024 12:06 AM

Tamannaah About Aranmanai 4 Movie

‘‘ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు వారి నటన విషయంలో పోలికలు రావొచ్చు. కొందరు పోటీలు పెట్టి మాట్లాడుతుంటారు. నేను ఈ పోటీని ఆహ్లాదకరంగానే తీసుకుంటాను’’ అంటున్నారు హీరోయిన్‌ తమన్నా. ఈ బ్యూటీ ఇలా అనడానికి కారణం ఉంది. తమన్నా, రాశీ ఖన్నా, సుందర్‌. సి లీడ్‌ రోల్స్‌లో నటించిన తమిళ చిత్రం ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘బాకు’) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో రాశీ ఖన్నాతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం గురించి తమన్నా ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడారు. ‘‘ఇండస్ట్రీలో పోటీ ఉండొచ్చు. అయితే మనం మనలా పెర్ఫార్మ్‌ చేయగలిగితే చాలు. ‘అరణ్మణై 4’ సినిమా కోసం నేను, రాశీ ఓ పాట చేశాం. ఇద్దరం ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చాం. అప్పుడు మేం మా డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌ పైనే ఫోకస్‌ పెట్టాం. సాంగ్‌ బాగా రావడానికి రాశీ ఖన్నా తన వంతు కృషి చేసింది. మేం ఇద్దరం ఒకరికొకరం సపోర్ట్‌ చేసుకోవడం వల్లే మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఓ కో స్టార్‌గా రాశీ బాగా సపోర్ట్‌ చేసిందని నాకనిపించింది. ఇలా పోటీ ఆహ్లాదకరంగా ఉంటే మంచిదే’’ అని చెప్పుకొచ్చారు తమన్నా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement