ఓటీటీలో ట్రెండ్‌ అవుతున్న అవార్డ్ విన్నింగ్‌ సినిమా | Survivor Movie Trending In OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలో ట్రెండ్‌ అవుతున్న అవార్డ్ విన్నింగ్‌ సినిమా

Sep 11 2024 1:36 PM | Updated on Sep 11 2024 1:51 PM

Survivor Movie Trending In OTT

రజత్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'సర్వైవర్‌'. ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డులను అందుకుని చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా 'సర్వైవర్‌' కావడం విశేషం. ఈ చిత్రం కూడా  కేన్స్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ ట్రైలర్‌, బెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ అవార్డులను అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, జియో సినిమాలో  స్ట్రీమింగ్‌ అవుతున్నది. ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు, ఎడిటర్‌ కూడా రజత్‌ రజనీకాంత్‌ కావడం విశేషం.

ఈ చిత్రం కోసం రజత్ రజనీకాంత్ ఎంచుకున్న కథ, యాక్షన్ ఎపిసోడ్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. అదేవిధంగా రజత్ పర్ఫామెన్స్ కి మూడు ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ అందుకున్నారు. సినిమా మీద ఉన్న మక్కువతో విభిన్నమైన చిత్రాలను మాత్రమే ఆయన నిర్మిస్తున్నారు. 2018 నుంచి మూడు సినిమాలు మాత్రమే ఆయన చేశారు. చేసిన ప్రతి సినిమాకి అవార్డు అందుకుంటున్నారు. కానీ సర్వైవర్ సినిమా ద్వారా ఎక్కువ గుర్తింపు పొందారు. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు రజత్ పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతున్నారు. కచ్చితంగా ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేస్తారని ఆశిస్తున్నారు.  డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, జియో  ఓటీటీలలో ట్రెండ్‌ అవుతున్న  'సర్వైవర్‌' చిత్రాన్ని మీరూ చూసేయండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement