కర్ణ ఆగడు | suriya as karna latest update | Sakshi
Sakshi News home page

కర్ణ ఆగడు

Oct 7 2024 6:05 AM | Updated on Oct 7 2024 6:05 AM

suriya as karna latest update

‘‘ఇక ‘కర్ణ’ లేనట్లే... ఆగిపోయింది’’ అంటూ ప్రచారంలో ఉన్న వార్తలకు బ్రేక్‌ పడేలా ఫ్లాష్‌ న్యూస్‌ ఇచ్చారు దర్శకుడు రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా. సూర్య టైటిల్‌ రోల్‌లో రాకేశ్‌ ఓంప్రకాశ్‌ ‘కర్ణ’ అనే సినిమాని తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర క్రితమే ఈ సినిమా గురించిన వార్త వచ్చింది. ఆ తర్వాత అప్‌డేట్‌ లేకపోవడంతో ‘కర్ణ’ ఆగిపోయిందనే వార్త తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘‘కర్ణ’ ఆగడు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి’’ అని తాజాగా పేర్కొన్నారు ఓంప్రకాశ్‌. మహాభారతం నేపథ్యంలో రూపొందనున్న ‘కర్ణ’లో కర్ణుడిగా సూర్య నటించనున్నారు.

కర్ణుడి భార్యపాత్రకు జాన్వీ కపూర్‌ని తీసుకోవాలనుకుంటున్నారట. సంగీతదర్శకత్వానికి ఏఆర్‌ రెహమాన్‌ని సంప్రదించారని సమాచారం. ఈ చిత్రాన్ని హిందీ, తమిళంలో చిత్రీకరించి, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అనువదించి, విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ విషయాల గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇక రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి రచయిత ఆనంద్‌ నీలకంఠన్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నారు. హిందీలో సూర్యకి ఇదే తొలి చిత్రం అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement