డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేనికి రజని ఫోన్‌, ఏమన్నారంటే..! | Superstar Rajinikanth Called Gopichand Malineni and Praise Him | Sakshi
Sakshi News home page

Rajinikanth-Gopichand Malineni: డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేనికి రజని ఫోన్‌, ఏమన్నారంటే..!

Jan 30 2023 1:11 PM | Updated on Jan 30 2023 1:17 PM

Superstar Rajinikanth Called Gopichand Malineni and Praise Him - Sakshi

గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరో తెరకెక్కిన చిత్రం ‘వీర సింహారెడ్డి’. సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. రాయలసీమ నేపథ్యంలో యాక్షన్‌, ఫ్యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం బాలయ్య కెరీర్లో ఘన విజయం సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా చూసిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వీర సింహారెడ్డి టీంను ప్రశంసించారు.

చదవండి: పూజా హెగ్డే ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు షేర్‌ చేసిన ‘బుట్టబొమ్మ’

అంతేకాదు డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేనికి ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారట తలైవా. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ మురిసిపోయారు గోపిచంద్‌. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘‘ఇది నాకు అద్భుతమైన క్షణం. తలైవా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సర్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ‘వీర సింహారెడ్డి చిత్రాన్ని చూశాను. మూవీ మేకింగ్‌ నాకు బాగా నచ్చింది’ అని ఆయన నాతో చెప్పారు.

చదవండి: కర్ణాటకలో సింగర్‌ కైలాశ్‌ ఖేర్‌పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం

మా చిత్రం గురించి ఆయన అన్న మాటలు, ఆయనకు కలిగిన భావోద్వేగం.. ఇంతకంటే నాకు ఈ ప్రపంచంలో విలువైనది ఇంకేదీ లేదనిపిస్తోంది. థ్యాంక్యూ రజని సర్‌’’ అని గోపించంద్‌ మలినేని ఆనందం వ్యక్తం చేశాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మించిన ఈ మూవీలో బాలయ్య సరసన శృతి హాసన్‌ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్‌, కన్నడ స్టార్‌ దునియా విజయ్‌ విలన్స్‌గా నటించారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement