విజయ్‌ దేవరకొండకి ఫాదర్‌గా?

Sunil Shetty May Act As In Fighter Telugu Movie - Sakshi

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఫైటర్‌’. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. తండ్రి పాత్రను  బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి చేయనున్నారని సమాచారం. సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాల్లో సునీల్‌ శెట్టి పాత్ర కనిపిస్తుందట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మళ్లీ ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top