‘బుజ్జి ఇలా రా’ అంటున్న సునీల్‌

Sunil And Dhanraj New Movie Titled As Bujji ilaa Raa - Sakshi

కమెడియ‌న్స్‌గా క‌లిసి మెప్పించిన సునీల్‌, ధ‌న‌రాజ్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రానికి `బుజ్జి ఇలా రా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. `ఇట్స్ ఎ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్` అనేది ట్యాగ్‌లైన్‌. అంద‌రిలో ఆస‌క్తిని క్రియేట్ చేస్తోన్న ఈ టైటిల్ పోస్ట‌ర్‌తోనే సినిమా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ మూవీ అని అర్థ‌మ‌వుతుంది. 

సినిమాటోగ్రాఫర్ గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వ‌ర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై  అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top