ఆ కథ పూరి నాకే చెప్పారు

Sumanth Interview About Kapatadhaari Movie - Sakshi

‘‘ఇప్పటివరకూ ప్రేక్షకులు చాలా రకాల థ్రిల్లర్‌ చిత్రాలు చూశారు. కానీ మా ‘కపటధారి’ ఓ కొత్త తరహా థ్రిల్లర్‌. ఇప్పటి వరకూ వచ్చిన థ్రిల్లర్‌ సినిమాలకు భిన్నంగా ఉంటుంది అని చెప్పగలను’’ అన్నారు సుమంత్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కపటధారి’. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఈ సినిమాను జి. ధనంజయ్‌ నిర్మించారు. కన్నడ చిత్రం ‘కవలుదారి’కి ఇది తెలుగు రీమేక్‌. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా సుమంత్‌ చెప్పిన విశేషాలు.

►‘మళ్ళీ రావా’ చిత్రం తర్వాత వరుసగా నాకు రొమాంటిక్‌ చిత్రాలు వస్తాయనుకున్నాను. కానీ ఎక్కువ థ్రిల్లర్‌ ఆఫర్స్‌ వచ్చాయి. ‘కపటధారి’ చిత్రం థ్రిల్లర్స్‌లోనే భిన్నంగా ఉంటుంది. ‘కవలుదారి’ చూసినప్పడు నాకు కొన్ని సన్నివేశాలు కొత్తగా అనిపించాయి. ఈ సినిమా మూడ్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. కథ ఏ ప్రాంతం ఆడియన్స్‌కి అయినా కనెక్ట్‌ అవుతుంది. అందుకే ఈ సినిమా చేశాను.

►ఈ సినిమాలో ట్రాఫిక్‌ పోలీస్‌ పాత్రలో కనిపిస్తాను. 40 ఏళ్ల క్రితం మూసివేసిన ఓ కేసును ఓ ట్రాఫిక్‌ పోలీస్‌ ఎలా చేధించాడు అనే కథాంశంతో సినిమా ఉంటుంది. కామెడీ, యాక్షన్‌ అన్నీ మోతాదులోనే ఉంటాయి. ఈ కథ నిజంగా జరిగినట్టుగా అనిపించేలా ఉంటుంది. కన్నడ సినిమా కాస్త నెమ్మదిగా ఉంటుంది. తెలుగు వెర్షన్‌‌ కాస్త వేగంగా ఉంటుంది.

►మహాభారతంలో శ్రీకృష్ణుణ్ణి కపటధారి అంటారు. అంటే పైకి కనిపించేది ఒకటి. కానీ లోపల జరిగేది ఒకటి. ఈ కథకు ఈ టైటిల్‌ కరెక్ట్‌గా సూట్‌ అవుతుంది. గత ఏడాది ఫిబ్రవరికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మార్చిలో విడుదల కావాల్సింది. లాక్‌డౌ¯Œ  వచ్చింది.

►నేనెప్పుడూ నాకు నచ్చిన, నాకు నప్పే కథలే ఎంచుకోవడానికి ఇష్టపడతాను. ఒకవేళ ఆ కథ నాకు సూట్‌ అవ్వదనిపిస్తే ఆ దర్శకుడికి అప్పుడే చెప్పేస్తాను. గతంలో చాలాసార్లు ఇలా చెప్పిన సందర్భాలు
కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ్‌గారు ‘దేశముదురు’ కథ నాకు చెప్పారు. ఇది నాకు సూట్‌ కాదు సార్‌ అన్నాను. ఆ సినిమా నాతో తీస్తే పక్కా ఆడేది కాదు.

►మంచి కథ కుదిరితే ఓటీటీలో చేస్తాను. నిర్మాతగా మారాలనే ఆలోచన లేదు. ఒకవేళ ఎవరైనా మంచి కథతో వచ్చి, నిర్మాత దొరకలేదు అంటే నిర్మిస్తాను. ప్రస్తుతానికి అయితే నా సినిమాలకు నిర్మాతలు వస్తున్నారు. ఆ విషయంలో హ్యాపీ. నెక్ట్స్‌ ‘అనగనగా ఓ రౌడీ’ అనే సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత ఓ రొమాంటిక్‌ డ్రామా చేస్తాను.

►లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే జిమ్‌ పెట్టుకున్నాను. హోమ్‌ థియేటర్‌ కాస్త అప్‌గ్రేడ్‌ చేసుకున్నాను. లాక్‌డౌ¯Œ  నాకు పెద్ద తేడా అనిపించలేదు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండటం నాకు అలవాటు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top