Sumanth First Look Poster From Sita Ramam Movie Deets Inside - Sakshi
Sakshi News home page

Sumanth Sita Ramam Movie: 'సీతారామం' నుంచి సుమంత్‌ ఫస్ట్ లుక్‌ వీడియో..

Jul 9 2022 3:07 PM | Updated on Jul 9 2022 3:31 PM

Sumanth First Look Poster From Sita Ramam Movie - Sakshi

మలయాళ యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్, మృణాళినీ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్‌ నిర్మించిన చిత్రం ఇది.

Sumanth First Look Poster From Sita Ramam Movie: మలయాళ యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్, మృణాళినీ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్‌ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్‌ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. 

ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఇందులో సుమంత్‌ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను వీడియో ద్వారా రిలీజ్ చేశారు. ఈ మూవీలో బ్రిగేడియర్‌ విష్ణు శర్మ పాత్రలో సుమంత్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ అధికారిగా కొత్త లుక్‌లో సుమంత్‌ అట్రాక్ట్‌ చేస్తున్నాడు. 'కొన్ని యుద్ధాలు మొదలు పెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు' అని సుమంత్‌ చెప్పే డైలాగ్‌ ఎఫెక్టివ్‌గా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. 
 


Advertisement
 
Advertisement
Advertisement