దుల్కర్‌ సల్మాన్‌-రష్మిక మందన్నా 'సీతా రామం' నుంచి కొత్త అప్‌డేట్‌.. | Sita Ramam: First Single Oh Sita Hey Rama Promo Released | Sakshi
Sakshi News home page

Sita Ramam: ఫస్ట్‌ సింగిల్‌ ప్రొమో రిలీజ్‌

Published Sun, May 8 2022 3:49 PM | Last Updated on Sun, May 8 2022 4:34 PM

Sita Ramam: First Single Oh Sita Hey Rama Promo Released - Sakshi

Sita Ramam: First Single Oh Sita Hey Rama Promo Released: హను రాఘవపూడి డైరెక్షన్‌లో మలయాళ యంగ్‌ హీరో దుల్కర్ సల్మాన్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సీతా రామం'. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనేది ట్యాగ్‌లైన్. వైజయంతీ మూవీస్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, మృణాళిని ఠాకూర్‌, సుమంత కీలక పాత్రల్లో అలరించనున్నారు. బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీగా వస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్‌, ప్రియాంక దత్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ సింగిల్‌ 'ఓ సీత.. హే రామ'ని మే 9న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. 

తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రొమోను ఆదివారం (మే 8) విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించగా ఎస్పీ చరణ్‌, రమ్య బెహరా ఆలపించారు. విశాల్ చంద్రశేఖర్‌ మెలోడీయస్‌ సంగీతం బాగుంది. ఈ సాంగ్‌ ప్రొమో చివర్లో 'వెళ్లి సీత దగ్గర డ్యాన్స్‌ నేర్చుకోండి' అని దుల్కర్ సల్మాన్‌ సీతాకోక చిలుకలతో చెప్పడం చాలా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రొమో నెట్టింట వైరల్ అవుతోంది. చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అలాగే ఇటీవల విడుదలైన టైటిల్‌ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. 

చదవండి: నేను బ్యాడ్‌ బాయ్‌లానే కనిపిస్తాను: దుల్కర్‌ సల్మాన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement