
ప్రముఖ సినీ నటుడు సుమన్ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. తమిళం, తెలుగు, కన్నడలో 500కు పైగా చిత్రాల్లో నటించారు. సుమారు రెండు దశాబ్ధాలకు పైగానే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలతో అలరించిన ఆయనలో మరో ప్రత్యేకత ఉంది. సుమన్‌కు కరాటే, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందారు. ఈ విభాగంలో ఎన్నో పతకాలు గెలుచుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో రీసెంట్‌గా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు కూడా.. తనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. అంతేకాక గోపాల్ గురుక్కళ్ వద్ద కలరిపయట్టు అభ్యసించారు. అయితే, 65ఏళ్ల వయసులో కూడా ఆయన కరాటే యుద్ధ కళలో ప్రాక్టీస్ చేస్తున్నారు.
సుమన్ ప్రస్తుతం ఊటీలో ఉన్నారు. మలేషియాకు చెందిన గ్రాండ్‌మాస్టర్ అనంతన్ వద్ద కరాటేలో ప్రాక్టీస్ చేస్తున్నారు. గ్రాండ్‌మాస్టర్ కె. అనంతన్ మలేషియాకు చెందిన అత్యంత ఆదరణ పొందిన మార్షల్ ఆర్టిస్ట్ కావాడం విశేషం. అతను ఒకినావా గోజు ర్యు కరాటే దో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ మలేషియాకు అధిపతిగా ఉన్నారు. గతంలో కూడా ఆయనతో పాటు సుమన్ కొన్ని మెలుకువలు తెలుసుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.