ఆర్‌ఆర్‌ఆర్‌..  ఓ కనువిందు – స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌..  ఓ కనువిందు – స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌

Published Sun, Feb 12 2023 2:04 AM

Steven Spielberg On Rajamouli's RRR Movie - Sakshi

‘ఆర్‌ఆర్‌ఆర్‌’  సినిమాని  ప్రశంసించారు హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌. ఆయన దర్శకత్వంలో వచ్చిన హాలీవుడ్‌ చిత్రం ‘ది ఫేబుల్‌మ్యాన్స్‌’ గత ఏడాది నవంబరులో రిలీజ్‌ అయింది. ఈ చిత్రాన్ని ఈ నెల 10న రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ ఇండియాలో రిలీజ్‌ చేసింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ను దర్శకుడు రాజమౌళితో ఆన్‌లైన్‌ వేదికగా  ఇంటర్వ్యూ చేయించారు సంస్థ ప్రతినిధులు. ఈ ఇంటర్వ్యూలోని కొన్ని విషయాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

కాగా, ఈ ఇంటర్వ్యూ వేదికగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను మెచ్చుకున్నారు స్పీల్‌బర్గ్‌. ‘‘దర్శకుడు రాజమౌళిని తొలిసారి కలుసుకున్నప్పటికి నేను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చూడలేదు. ఇటీవల ఈ  సినిమా చూశాను. ఐ క్యాండీ (కనువిందు)గా అనిపించింది. అద్భుతంగా ఉంది’’ అన్నారు స్పీల్‌బర్గ్‌. ఆ ప్రశంసలకు రాజమౌళి స్పందిస్తూ.. మీరు (స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌) సినిమా చూసినందుకు చాలా ఆనందంగా ఉందనీ, సంతోషంతో డ్యాన్స్‌ చేయాలనిపిస్తోందనీ అన్నారు. ‘ది ఫేబుల్‌మ్యాన్స్‌’ను తాను చూశానని, నచ్చిందని కూడా రాజమౌళి పేర్కొన్నారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement