Know Reasons Behind Why Star Heroines Shows Special Interest To Act With Prabhas, Deets Inside - Sakshi
Sakshi News home page

Facts About Prabhas: ప్రభాస్‌ అంటే పడి చస్తున్న హీరోయిన్లు..ఎందుకంత స్పెషల్‌?

Aug 5 2023 7:03 PM | Updated on Aug 5 2023 7:37 PM

Star Heroines Special Interest To Act With Prabhas, Here The Reason - Sakshi

చాలామంది హీరోయిన్స్ ప్రభాస్ తో సినిమా అనగానే కనీసం కథ కూడా వినకుండా ఓకే చెప్పేస్తారు. ఇప్పుడంటే పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు కానీ.. గతంలో కేవలం తెలుగు సినిమాలు చేసినప్పుడు కూడా చాలా మంది హీరోయిన్లకి అతను స్పెషల్‌. అయితే ప్రభాస్ ఎందుకు స్పెషల్ అనే దానికి కూడా స్పెషల్ కారణం ఉంది. అదేంటంటే ప్రభాస్ బిహేవియర్. సినిమా ఇండస్ట్రీ లో ఎవ్వరి గురించి గాసిపింగ్ చెయ్యకుండా,అందరితో మర్యాదగా నడుచుకుంటాడు ప్రభాస్. అందుకే అతనికి డార్లింగ్ అనే పర్ఫెక్ట్ పెట్ నేమ్ కూడా సెట్ అయ్యింది. హీరోయిన్స్ కి కూడా ప్రభాస్ చాలా రెస్పెక్ట్ ఇస్తాడట.

(చదవండి: ‘ఆదిపురుష్‌’ ఎఫెక్ట్‌..‘సలార్‌’పై ప్రభాస్‌ కీలక నిర్ణయం)

అంతే కాదు ప్రభాస్ కి ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందుకే రకరకాల ఫుడ్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి ఫ్లైట్ లో కూడా తెప్పించుకుంటాడు. అయితే ప్రభాస్ ఆ ఫుడ్ ని తను తిని ఎంజాయ్ చెయ్యడమే కాదు, తనతో పాటు ఉండేవాళ్ళకి కూడా వడ్డిస్తాడు. ఆ లిస్ట్ లో కో యాక్టర్స్ తో పాటు హీరోయిన్స్ కూడా ఉంటారు. అంతే కాదు హైదరాబాద్ లో షూటింగ్ అయితే హీరోయిన్స్ కి కూడా ప్రభాస్ ఇంటి నుంచి కూడా అప్పుడప్పుడు స్పెషల్ క్యారేజ్ వస్తుంది. దానికి సంబంధించిన పిక్స్ ఆయా హీరోయిన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా పోస్ట్ చేసేవారు.

(చదవండి: వాళ్లు ఎన్నో మాటలన్నారు.. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించా: అబ్బాస్‌)

ప్రభాస్‌ గురించి చెప్పమంటే అతనితో నటించిన హీరోయిన్లు అంతా ముందుగా చెప్పేది అతను వడ్డించే భోజనం గురించే. ఆంధ్రాలో దొరికే అన్ని రకాల నాన్-వెజ్ వంటకాల్ని తన హీరోయిన్ల కోసం వండిస్తాడట ప్రభాస్‌.  ఆ మధ్య స్టార్‌ హీరోయిన్‌ శృతిహాసన్‌ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ప్రభాస్‌ అంటే తనకు ప్రేమ, భోజనం రెండూ గుర్తొస్తాయని చెప్పింది. సలార్‌ షూటింగ్‌ సమయంలో శృతికి రకరకాల వంటకాల రుచి చూపించాడట. ఇంటి నుంచి ప్రత్యేకమైన భోజనం తెప్పించి స్వయంగా వడ్డించాడట. 

నేటితరం హీరోల్లో ఈ క్వాలిటీ చాలా తక్కువమందికి ఉంటుంది. మర్యాద ఇస్తూ,కడుపునిండా తినేంత వరకు వదిలిపెట్టని హీరోలు అరుదు. అలా ఒక యూనీక్ క్వాలిటీ తో స్పెషల్ గా ఉంటాడు ప్రభాస్. అందుకే చాలామంది హీరోయిన్స్ ప్రభాస్ అంటే స్పెషల్ ఎఫెక్షన్ తో ఉంటారు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే డార్లింగ్ అంటే పడి చస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement