రజనీకాంత్‌తో సినిమా.. రాజమౌళి స్టేట్‌మెంట్, ‘ఆర్‌ఆర్‌’కి చాన్స్‌ ఉందా?

SS Rajamouli, Rajinikanth Might Team Up For A Movie - Sakshi

దర్శకధీరుడు రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు. సూపర్‌స్టార్‌ జనీకాంత్‌తో ఒక్క చిత్రమైన తీయాలని ప్రతి దర్శకుడు అనుకుంటాడు. మరి...రజనీకాంత్‌, రాజమౌళి కలిసి ఒక సినిమాకి సై అంటే ఎలా ఉంటుంది ? ఇప్పుడు ఈ టాపిక్‌ అటు కోలీవుడ్‌ నుంచి ఇటు టాలీవుడ్‌ దాకా తెగ హల్‌చల్‌ చేస్తోంది. రాజమౌళి  ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌ వల్లే ఇప్పుడు  ఈ డిస్కషన్‌ వచ్చింది. 

బ్రహ్మస్త్ర ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నై వెళ్లిన రాజమౌళి…రజనీకాంత్‌ని ఒక్క రోజైనా డైరెక్ట్‌ చేయాలని ఉందన్నాడు. తమిళ హీరోలతో ఎవరితో కలిసి పనిచేయాలని ఉందన్న ప్రశ్నకి రాజమౌళి చెప్పిన సమాధానం ఇది. మామూలుగా అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ…గతంలోనూ ఒక సందర్భంలో రాజమౌళి రజనీకాంత్‌తో చేయాలని ఉందని చెప్పారు. దీంతో…ఈ కాంబినేషన్‌ సెట్‌ అవడానికి అసలు ఏమన్నా చాన్స్‌ ఉందా అన్న చర్చతో రజనీకాంత్‌, రాజమౌళి ఫ్యాన్స్‌ బిజీగా ఉన్నారు. 

(చదవండి: బాలీవుడ్‌లో దూసుకెళ్తున్న కోలీవుడ్‌ డైరెక్టర్స్‌.. స్టార్‌ హీరోలతో సినిమాలు!)

అయితే ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం మహేశ్‌తో సినిమా తీసే పనిలో ఉన్నాడు రాజమౌళి. త్రివిక్రమ్‌ మూవీ తర్వాత మహేష్‌ బాబుతో రాజమౌళి సినిమా ఉంటుంది. ఈ సినిమా సెట్‌ మీదకు వెళ్లడానికి ఎంత లేదన్నా మూడేళ్లకి తక్కువ టైమ్‌ అయితే పట్టదు. అంటే మహేష్‌ బాబుతో సినిమా అయిపోయి మరో సినిమాకి రాజమౌళి సై అనాలంటే కనీసం మూడేళ్లు అయినా పడుతుంది. ఈ లోపు రజనీకాంత్‌ డేట్స్‌ ఖాళీ లేకపోయినా…ఇటు రాజమౌళి మరొక ప్రాజెక్ట్‌కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా…మళ్లీ కథ మొదటి కే వస్తుంది. దీంతో…జస్ట్‌ స్టేట్‌మెంట్ వరకే రాజమౌళి పరిమితం అవుతారా? లేక రజనీకాంత్‌ దాకా విషయాన్ని తీసుకెళతారా అన్నది ఆసక్తికరంగా మారింది. 

ప్రస్తుతం రజనీకాంత్‌ జైలర్‌ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నెల్సన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కు తోన్న ఈ మూవీ 2023లో రిలీజ్‌ కానుంది. అదే సమయంలో ఇటు రాజమౌళి మహేష్‌ బాబు మూవీ షూటింగ్‌లో బిజీ అయిపోతాడు. సో…ఇప్పటికిప్పుడు అయితే ఈ కాంబినేషన్‌ వర్కౌట్‌ అయ్యే చాన్స్‌లు తక్కువే అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 

బాహుబలి, ఆర్‌ఆర్‌లతో రాజమౌళికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఇక రజనీకాంత్‌కి ఇండియాలో మాత్రమే కాదు. జపాన్‌ నుం చి మొదలుపెడితే ఆసియా అంతా ఫ్యాన్స్‌ ఉన్నారు. వీరి కాంబినేషన్‌ కనుక సెట్‌ అయితే  ఆర్‌ఆర్‌(రజనీకాంత్‌, రాజమౌళి) కచ్చితంగా పాన్‌ ఆసియా మూవీ అవుతుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top