తిరుపతి వదిలి వెళ్లే ప్రసక్తే లేదు! | Srinivasa Mangapuram teaser Launch By Hero Mahesh Babu | Sakshi
Sakshi News home page

తిరుపతి వదిలి వెళ్లే ప్రసక్తే లేదు!

Apr 16 2026 4:44 AM | Updated on Apr 16 2026 5:12 AM

Srinivasa Mangapuram teaser Launch By Hero Mahesh Babu

‘ఈ క్షణం ఇప్పటికిప్పుడు నీకు ఏమనిపిస్తోంది’ అంటూ జయకృష్ణ చెప్పే డైలాగ్‌తో ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ టీజర్‌ ఆరంభమైంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ, నటి రవీనా టాండన్‌ కుమార్తె రాషా తడాని జోడీగా నటిస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్‌ భూపతి దర్శకత్వంలో అశ్వినీదత్‌ సమర్పణలో పి. కిరణ్‌ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా టీజర్‌ని హీరో మహేశ్‌బాబు లాంచ్‌ చేశారు. ‘నేను అసలు నీ ఫ్రెండ్‌ లిస్ట్‌లో ఉన్నానా?, మంగ లేక΄ోతే ఈ వాసుగాడు తిరుపతి వదిలి వెళ్లే ప్రసక్తే లేదు’ అంటూ జయకృష్ణ చెప్పే డైలాగులు టీజర్‌లో ఉన్నాయి. ‘‘తిరుపతి పట్టణంలో సాగే ఈ కథ వాసు బాబు, మంగ అనే ఇద్దరు స్నేహితులు... ప్రేమికులుగా మారి ఆనందంగా జీవించే ప్రయాణాన్ని చూపిస్తుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: జయకృష్ణ. 

Advertisement
 
Advertisement
Advertisement