ఐదు భాషల్లో జాలరి  | Sakshi
Sakshi News home page

ఐదు భాషల్లో జాలరి 

Published Fri, Dec 8 2023 12:59 AM

Srihari: Jaalari New Movie Opening - Sakshi

శ్రీహరి హీరోగా రాజ్‌ తాళ్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘జాలరి’ సినిమాప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి దర్శకుడు సముద్ర కెమెరా స్విచ్చాన్‌ చేసి, స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందించారు.

ఐదు భాషల్లో ‘జాలరి’ని ఎమ్‌వై3 ప్రోడక్షన్స్‌ పతాకంపై ఆదిత్య పల్లా, రఘు కుడితిపూడి, సాయికిరణ్‌ బత్తుల, రక్తం దశరథ్‌ గౌడ్‌ నిర్మించనున్నారు. ‘‘1980 నేపథ్యంలో కమర్షియల్‌ ఫార్మాట్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement
Advertisement