సరికొత్త పాత్రలో

Sri Vishnu next movie with Beckham Venugopal - Sakshi

వైవిధ్యమైన కథలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలతో దూసుకుపోతున్నారు శ్రీ విష్ణు. ఆయన నటిస్తున్న ‘రాజ రాజ చోళ’ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయింది. ‘గాలి సంపత్‌’ చిత్రంతో పాటు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఓ సినిమా షూటింగ్‌ ప్రోగ్రెస్‌లో ఉండగా తాజాగా మరో సినిమా అంగీకరించారు శ్రీ విష్ణు. ప్రదీప్‌ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘యాక్షన్‌ ఎమోషనల్‌ డ్రామాగా రూపొందనున్న చిత్రమిది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ చేయని సరికొత్త పాత్రలో శ్రీవిష్ణు కనిపిస్తారు. 2021 మొదట్లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర, సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top