Kiran Abbavaram: తీవ్ర విషాదం.. హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు మృతి

Actor Kiran Abbavaram Brother Died In Road Accident: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రోజుల వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రాణాలు విడిచారు. ఈ విషాదాల నుంచి తేరుకోకముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి మృతిచెందాడు. బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై రామాంజులు కన్నుమూశాడు. దీంతో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ‘రాజావారు రాణిగారు’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ చిత్రంతో గుర్తింపు పొందాడు. రామాంజులు రెడ్డి మృతితో ఆయన ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది.