
ఛాన్స్ ఇస్తే ఇండియన్ సినిమాలో నటిస్తానంటున్నాడు స్క్విడ్ గేమ్ హీరో లీ జంగ్ జే (Lee Jung Jae). నెట్‌ఫ్లిక్స్ బ్లాక్‌బస్టర్ సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game) మూడు సీజన్లలో కథానాయకుడిగా యాక్ట్ చేశాడు లీ జంగ్ జే. ప్లేయర్ 456గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా అతడు భారతీయ సినిమాలో నటించాలనుందన్న కోరికను బయటపెట్టాడు. ఛాన్సిస్తే బాలీవుడ్ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. మరి లీ జంగ్ జే భవిష్యత్తులో బాలీవుడ్ సినిమాలో కనిపిస్తాడేమో చూడాలి!
సినిమా- సిరీస్
దక్షిణ కొరియాకు చెందిన లీ జంగ్ జే.. ఎన్ ఎఫైర్, సిటీ ఆఫ్ ద రైజింగ్ సన్, ఓ బ్రదర్స్, ఓవర్ ద రైన్‌బో, లాస్ట్ ప్రజెంట్, బిగ్ మ్యాచ్, ద ఫేస్ రీడర్, డెలివర్ అజ్ ఫ్రమ్ ఈవిల్ ఇలా అనేక సినిమాలు చేశాడు. స్క్విడ్ గేమ్ మొదటి సీజన్‌తో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్‌లో తన నటనకుగానూ ఆసియా ఆర్టిస్ట్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ టీవీ అవార్డు అందుకున్నాడు హంట్ సినిమాతో దర్శకుడిగానూ మారాడు.
చదవండి: 'బిగ్‌బాస్'లో టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆ హీరోయిన్ కూడా!