వినూత్నమైన క్రైమ్ డ్రామాగా ‘స్పార్క్‌ 1.O ’ | Sakshi
Sakshi News home page

వినూత్నమైన క్రైమ్ డ్రామాగా ‘స్పార్క్‌ 1.O ’

Published Mon, Aug 1 2022 1:45 PM

Spark One Point O Movie Censor Completed - Sakshi

ప్రీతి సుందర్, భవ్యశ్రీ, హితేంద్ర, రాము  ప్రధాన పాత్రల్లో యంగ్‌ డైరెక్టర్‌ సురేష్ మాపుర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘స్పార్క్ 1.O’. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా క్రైమ​ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై  వి.హితేంద్ర నిర్మిస్తున్నారు. ఇటీవల హీరో శ్రీకాంత్‌ విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇద్దరు పవర్‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ నడుమ సాగే వినూత్నమైన క్రైమ్ డ్రామాగా స్పార్క్‌ 1.O తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం ఆగస్టు ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రేజీ క్రైమ్ ఎంటర్టైనర్ చిత్రంలో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని హీరోయిన్స్ లో ఒకరైన భవ్యశ్రీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement