అదిరిపోయే సోనూసూద్‌ మరో టాలెంట్

sonu sood sharpening knives - Sakshi

ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే సోనూ సూద్‌ మళ్లీ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాడు. కాకపోతే ఈ సారి తనకున్న మరో స్కిల్‌ చూపిస్తున్న వీడియోతో మనముందుకు వచ్చాడండోయ్‌. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు సహాయం చేయడంతో సోనూ సూద్ ప్రజల దృష్టిలో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి తన చేతనైన సాయాన్ని ప్రజలకు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.

టాలీవుడ్‌కి విలన్‌గా పరిచయమైనప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. ‘వదల బొమ్మాలి’ అంటూ అరుంధతిలో తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక  సోనూ సూద్‌ తన ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. అందులో ఎంతో హుషారుగా చాకులకు పదును పెడుతూ తన మరో టాలెంట్‌ను చూపిస్తున్నాడు. నా కొత్త దుకాణానికి స్వాగతం అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. ( చదవండి: ‘వైల్డ్‌ డాగ్‌’కి ఊహించని ఎదురుదెబ్బ.. షాక్‌లో చిత్ర యూనిట్! )

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top