‘వైల్డ్‌ డాగ్‌’కి ఊహించని ఎదురుదెబ్బ.. షాక్‌లో చిత్ర యూనిట్!

Wild Dog Full Movie Leaked In Online - Sakshi

అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం(ఏప్రిల్‌ 2)న విడుదలై మిక్స్‌డ్ టాక్‌తో దూసుకెళ్తుంది. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కింగ్‌ నాగ్‌  ఏసీపీ విజయ్‌ వర్మగా అదరగొట్టాడు. గత రెండేళ్లుగా సరైన హిట్‌ లేక సతమతమవుతున్న కింగ్‌ నాగ్‌.. ‘వైల్డ్‌ డాగ్‌’తో హిట్‌ ట్రాక్‌ ఎక్కాలని చూశాడు. అనుకున్నట్లే మార్నింగ్‌ షో నుంచే ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇలాంటి సమయంలో ‘వైల్డ్‌ డాగ్‌’టీమ్‌కి భారీ షాక్‌ తగిలింది. పైరసీ భూతం ‘వైల్డ్‌ డాగ్‌’ని కూడా వదల్లేదు. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే .. పైరసీ వీడియో బయటకు వచ్చేసింది. పైరసీని ప్రోత్సహించే కొన్ని వెబ్‌సైట్లు వైల్డ్‌ డాగ్‌ పుల్‌ మూవీ డౌన్‌లోడ్‌ లింక్‌ను శుక్రవారమే పెట్టేశాయి. దీంతో కలెక్షన్లపై ప్రభావం ఉండే ప్రమాదం ఏర్పడింది.

వాళ్లు ఫుల్‌ చేస్తే.. వీళ్లు లీక్‌ చేశారు
వైల్డ్‌ డాగ్‌ మూవీ విడుదలకు ఒక్క రోజు ముందు అంటే గురువారమే లీకైపోయిందంటూ చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ మూవీస్ ట్వీట్‌ చేసింది. అయితే అది అబద్దమని, జనాల్ని ఫూల్స్ చేయడానికే అలా చేశామని చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. అయితే ఒక్క రోజు తర్వాత నిజంగానే తమ మూవీ నిజంగానే లీకైపోవడంతో చిత్ర యూనిట్‌ షాక్‌కు గురైంది. మరి పైరసీ భూతం ఎఫెక్ట్‌ ‘వైల్డ్‌ డాగ్‌’ కలెక్షన్స్‌పై ఏ మేరకు ఉంటుందో చూడాలి.
చదవండి:
వైల్డ్‌ డాగ్‌’ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే..
'వైల్డ్‌ డాగ్'‌ మూవీ రివ్యూ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Author:
కె. రామచంద్రమూర్తి
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top