క్లాప్‌ క్లాప్‌... సితార | Sitara gives first clap for Mahesh Babu Sarkaru Vaari Pata | Sakshi
Sakshi News home page

క్లాప్‌ క్లాప్‌... సితార

Nov 22 2020 5:49 AM | Updated on Nov 22 2020 5:49 AM

Sitara gives first clap for Mahesh Babu Sarkaru Vaari Pata - Sakshi

మహేశ్‌బాబు; నమ్రత, సితార, పరశురామ్‌

తండ్రి మహేశ్‌బాబు సినిమాకి సితార క్లాప్‌ కొట్టింది. భర్త మహేశ్‌ కోసం నమ్రత కెమెరా స్విచాన్‌ చేశారు. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో  మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌ మెంట్, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు నిర్మించనున్న ‘సర్కారు వారి పాట’ సినిమా పూజా కార్యక్రమాలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా చిత్రీకరించిన ముహూర్తం షాట్‌కి నమ్రత కెమెరా స్విచాన్‌ చేయగా, సితార క్లాప్‌ ఇచ్చింది.

హైదరాబాద్‌లోని ఓ గుడిలో జరిగిన ఈ వేడుకలో సితార సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అని చెప్పాలి. జనవరి మొదటి వారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభించుకోనున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్‌. ఎస్‌.ఎస్, కెమెరా: మది, లైన్‌ ప్రొడ్యూసర్‌: రాజ్‌ కుమార్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, రామ్‌ ఆచంట, గోపి ఆచంట.

Advertisement
 
Advertisement
Advertisement