'నా జీవితంలో మార్పు తెచ్చిన క్షణమిదే'.. సింగర్ సునీత పోస్ట్ వైరల్! | Singer Sunitha Marriage Anniversary, Netizens Wishes Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Singer Sunitha Marriage Anniversary: 'నా జీవితం మొత్తంలో అద్భుతమైన క్షణాలు'.. సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్!

Published Tue, Jan 9 2024 2:26 PM

Singer Sunitha Marriage Anniversary Goes Viral In Social Media - Sakshi

సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతలా తెలుగువారి గుండెల్లో ఆమె స్థానం సంపాదించుకున్నారు. 17 ఏళ్ల వయసులోనే కెరీర్  ప్రారంభించిన సునీతకు 19 ఏళ్లకే పెళ్లయింది. చిన్న వయసులోనే సంపాదిస్తూ.. కుటుంబానికి నేనే పెద్ద దిక్కుగా నిలిచారు. ఇద్దరు పిల్లలు పుట్టాక.. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది.

అయినప్పటికీ సునీత తన కెరీర్‌ను కొనసాగించింది. అటు సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని గాన కోయిల ఆమె.  సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమెకు ఉంది.  జీవితంలో అన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్న సింగర్ సునీత మరోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 

అయితే ఆ తర్వాత సునీత రెండో పెళ్లి చేసుకుంది. జనవరి 9న, 2021లో ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనిని పెళ్లాడింది. ఆమెకు రెండో పెళ్లయ్యాక మూడో వివాహా వార్షికోత్సవం ఇవాళ జరుపుకోనుంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నా జీవితం మొత్తంలో అద్భుతమైన  క్షణమిదే అంటూ పోస్ట్ చేశారు. 

ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం సునీత పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.  కాగా.. ఇటీవలే స్టార్‌ సింగర్‌ సునీత కుమారుడు ఆకాశ్‌ హీరోగా  ఎంట్రీ ఇచ్చారు.  సర్కారు నౌకరి అనే చిత్రంలో నటించారు. గంగనమోని శేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement
 
Advertisement