ఇది నేను ఊహించలేదు, షాకయ్యా: సింగర్‌ సునీత

singer Sunitha Comments On Lockdown In Instagram Live - Sakshi

స్టార్‌ హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఏకైక సింగర్‌ సునీత. ఇటీవల రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకున్న ఆమె అప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అంతేగాక సోషల్‌ మీడియాలో సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్న ఆమె కరోనా కాలంలో రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో లైఫ్‌ సెషన్‌ నిర్వహించి అభిమానులతో ముచ్చడిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఆసక్తిక విషయాలను పంచుకుంటున్న సునీత అభిమానుల అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పడమే కాకుండా వారు అడిగిన పాటలు పాడుతు అలరిస్తున్నారు.

అంతేగాక సమాజంలో జరిగే కొన్ని సంఘటనలపై కూడా ఆమె స్పందిస్తున్నారు. కాగా నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నిన్నటి లైవ్‌లో ఆమె స్పందించారు. ‘ప్రస్తుతం కరోనా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. దీంతో లాక్‌డౌన్‌ ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. లాక్‌డౌన్‌ అనగానే అందరూ నిత్యవసర సరుకులు, ఇతర సామాగ్రి కోసం షాపుల ముందు జనాలు క్యూ కడుతున్నారు. అయితే ఇక్కడ నన్ను బాధించే విషయమేంటంటే వైన్‌ షాపుల ముందు కూడా జనాలు బారులు తీరుతన్నారు. ఇది నేను ఊహించలేదు. 

ఇది నిజంగా బాధాకరం. లాక్‌డౌన్‌ వల్ల సమాజంలో కొంత మార్పు వస్తుందని అభిప్రాయపడ్డాను. కానీ ఈ సంఘన చూసి షాకయ్యా’ అంటూ ఆమె లైవ్‌లో వ్యాఖ్యానించారు. కాగా కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు తనవంతు సాయంగా సునీత ప్రతిరోజూ ఓ అరగంట పాటు లైవ్‌లోకి వచ్చి పాటలు పాడుతున్నారు. ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు నెటిజన్లు కోరిన పాటలు పాడుతూ తన గానామృతంతో ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో నెటిజన్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన పాటలతో రిలీఫ్‌ పొందుతున్నామని చెప్పడంతో ఆమె ప్రతి రోజు లైవ్‌కి వస్తానని తెలిపారు. 

చదవండి: 
లైవ్‌లో సింగర్‌ సునీతను వాట్సాప్‌ నెం అడిగిన నెటిజన్‌..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top