ఆ ఒక్క పాట సునీత జీవితాన్నే మార్చేసింది..

Singer Sunitha Birthday Special : Intresting Things To Know About Her - Sakshi

సింగర్‌ సునీత బర్త్‌డే ‍స్పెషల్‌

సింగర్‌ సునీత..స్టార్‌ హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఏకైక సింగర్‌ .టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమె సొంతం. సునీత గానం ఎంత మధురంగా ఉంటుందో.. రూపం కూడా అంతే ఆకర్షనీయంగా ఉంటుంది. ఆమె అందానికి ముగ్ధులు కానివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.  కేవలం గాయనిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా,యాంకర్‌గా సత్తా చాటిన సునీత 1978 మే 10న విజయవాడలో జన్మించింది. ఈమె పూరు పేరు సునీత ఉపాద్రష్ట.

ఇంట్లో దాదాపు అందరూ సంగీత విద్వాంసులు కావడంతో చిన్నతంలోనే కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంది సునీత. అలా 13 ఏళ్లకే గురువుతో కలిసి త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె 15 ఏళ్ల వయసులో ‘పాడుతా తీయగా’ పోగ్రాంలో పాల్గొంది. ఇక "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు"  పాటతో సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆమె ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఒక్క పాటతో సంగీత అభిమానుల్ని తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో తన శ్రావ్యమైన గొంతుతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది.

తమన్నా, అనుష్క, సౌందర్య, జెనీలియా, శ్రియా, భూమిక, మీరా జాస్మిన్ సహా పలువురు హీరోయిన్లకు గాత్రదానం చేసింది. అలా ఎనిమిదేళ్ల కాలంలోనే సుమారు 500 సినిమాలకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. ఆ సమయంలో సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వరించినా సున్నితంగా తిరస్కరించింది. ఇప్పటి వరకు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కలిపి మూడు వేల పైచిలుకు పాటలు పాడింది. 19 ఏళ్లకు కిరణ్‌ కుమార్‌ గోపరాజును వివాహం చేసుకున్న సునీత ఆ తర్వాత  మనస్పర్ధలు రావడంతో విడిపోయింది. ఈ దంపతులకు ఆకాశ్‌, శ్రేయ అనే పిల్లులున్నారు. ఇటీవలె ఈ ఏడాది  జనవరి 9న వ్యాపారవేత్త రామకృష్ణ వీరపనేనితో సునీత రెండో వివాహం చేసుకుంది. కాగా.. సునీత, రామ్‌లు ఇరువురికి కూడా ఇది రెండో పెళ్లి. 

చదవండి : ఆ డైరెక్టర్‌ నాతో వ్యవహరించిన తీరుకు షాకయ్యా: సునీత
రామ్‌ అలా ప్రపోజ్‌ చేశాడు : సింగర్‌ సునీత

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top