బాబు బంగారం! | Simbu donated gold coins to unit members | Sakshi
Sakshi News home page

బాబు బంగారం!

Nov 8 2020 6:02 AM | Updated on Nov 8 2020 6:02 AM

Simbu donated gold coins to unit members - Sakshi

సినిమా షూటింగ్‌ అంటే మినిమమ్‌ వంద రోజులు యూనిట్‌ అంతా ట్రావెల్‌ చేస్తారు. సినిమా భారీతనాన్ని బట్టి రోజులు పెరుగుతాయి. చిన్న సినిమాలంటే ముప్ఫై నలభై రోజుల్లో పూర్తవుతాయి. రోజులు ఎన్నయినా ఒక సినిమా పూర్తయ్యేంతవరకూ కలిసి ప్రయాణం చేస్తారు కాబట్టి షూటింగ్‌ చివరి రోజు ఒకింత ఎమోషన్‌ అవుతారు. కొంతమందైతే బహుమతులు కూడా ఇచ్చుకుంటారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇలా జరుగుతుంటుంది. షూటింగ్‌ చివరి రోజున అజిత్, విజయ్‌ వంటి స్టార్‌ హీరోలు యూనిట్‌ సభ్యులకు బహుమతులు ఇస్తుంటారు. తాజాగా మరో స్టార్‌ శింబు కూడా ‘ఈశ్వరన్‌’ సినిమాకి పని చేసిన 400 మందికి ఒక గ్రాము బంగారు నాణెం బహుమతిగా ఇచ్చారు. అలాగే 200 మంది జూనియర్‌ ఆర్టిస్టులకు బట్టలు పెట్టారు. శింబూకి వివాదస్పద వ్యక్తి అనే పేరుంది. అయితే ఇలాంటి మంచి పనులు చేసి ‘బాబు బంగారం’ అని కూడా అనిపించుకుంటుంటారు. ఇక సుశీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఈశ్వరన్‌’ సంక్రాంతికి  విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement