'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్‌ చూశారా..? | Sakshi
Sakshi News home page

'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్‌ చూశారా..?

Published Sat, May 18 2024 9:50 PM

Silk Saree Movie Trailer Out Now

వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'సిల్క్ శారీ'. ఈ చిత్రాన్ని చాహత్ బ్యానర్‌పై కమలేష్ కుమార్ నిర్మిస్తున్నారు. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరితో దర్శకుడు టి. నాగేందర్ రూపొందిస్తున్నారు. "సిల్క్ శారీ" సినిమా మే 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. 

ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు మురళీ మోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కమలేష్ కుమార్ మాట్లాడుతూ.. 'సిల్క్ శారీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలు మురళీ మోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజలకు థ్యాంక్స్ చెబుతున్నా. ఒక మంచి మూవీతో టాలీవుడ్‌లోకి  నిర్మాతగా అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. ఇకపైనా మా చాహత్ బ్యానర్‌పై రెగ్యులర్‌గా సినిమాలు రూపొందిస్తాం. మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. ఈ నెల 24న థియేటర్స్‌లోకి వస్తున్న మా 'సిల్క్ శారీ' సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం.' అని ఆయన అన్నారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement