ఇడ్లీ, సాంబార్‌ అంటే ఊరుకునేది లేదు: శృతి హాసన్‌ | Shruti Haasan: Not ok to call us 'Idli Sambar Dosa' | Sakshi
Sakshi News home page

Shruti Haasan: ఇడ్లీ.. సాంబార్‌.. కామెడీగా ఉందా?

Published Fri, Jun 21 2024 10:31 AM | Last Updated on Fri, Jun 21 2024 12:52 PM

Shruti Haasan: Not Ok to Call us Idli Sambar Dosa

ఒకరికి నచ్చేలా కాకుండా తనకు నచ్చినట్లుగా బతికేస్తుంటుంది హీరోయిన్‌ శృతిహాసన్‌. నటిగానే కాకుండా సింగర్‌గానూ తన సత్తా చూపింస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ సోషల్‌మీడియాలో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ చేస్తుంటుంది. అలా తాజాగా మరోసారి అభిమానులతో మాటామంతీ నిర్వహించింది. ఈ క్రమంలో తనకు ఎదురైన ప్రశ్నపై అసహనం వ్యక్తం చేసింది.

ట్రై చేయొద్దు
సౌత్‌ ఇండియన్‌ యాసలో ఏదైనా చెప్పవా? అని ఓ నెటిజన్‌ అడగ్గా.. అందుకు శృతి ఇలా రియాక్ట్‌ అయింది. ఓకే.. ఈ రకమైన జాతివివక్షను నేను అస్సలు సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ, దోస, సాంబార్‌.. ఇలాంటి పేర్లతో పిలిస్తే మేము ఊరుకోలేము. మీరు మమ్మల్ని అనుకరించలేరు.. కాబట్టి మాలాగా ఉండాలని ట్రై చేయకండి.. ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోము. సౌత్‌ ఇండియన్‌ భాషలో ఏదైనా చెప్పమేని అడిగావు కదా.. నోరు మూసుకుని వెళ్లు అని తమిళంలో రాసుకొచ్చింది.

ఇడ్లీ..వడ..
కాగా ఆ మధ్య జామ్‌నగర్‌లో జరిగిన అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో షారూఖ్‌ ఖాన్‌.. రామ్‌చరణ్‌ను అందరిముందు ఇడ్లీ వడ అని పిలిచాడు. అలా పిలవడాన్ని చరణ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ జెబా హాసన్‌ తీవ్రంగా తప్పు పట్టింది. అంత పెద్ద హీరోను పట్టుకుని స్నాక్స్‌ పేరుతో పిలుస్తారా? అని మండిపడింది. శృతి హాసన్‌ విషయానికి వస్తే సలార్‌ సినిమాతో సందడి చేసిన ఆమె ప్రస్తుతం డకాయిట్‌ మూవీలో అడివిశేష్‌తో కలిసి నటిస్తోంది.

చదవండి: హీరో వంటమనిషికి రూ.2 లక్షలా.. తన వంట చూస్తే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement