మా నాన్న నా బెస్ట్‌ హ్యూమన్‌: శ్రుతీహాసన్‌ | Shruti Haasan and Payal Rajput Talks about Fathers Day | Sakshi
Sakshi News home page

Father’s Day: మా నాన్న నా బెస్ట్‌ హ్యూమన్‌: శ్రుతీహాసన్‌

Jun 18 2023 12:39 AM | Updated on Jun 18 2023 10:06 AM

Shruti Haasan and Payal Rajput Talks about Fathers Day - Sakshi

‘మా నాన్న నా బెస్ట్‌ హ్యూమన్‌’ అన్నారు శ్రుతీహాసన్‌. ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా తండ్రి కమల్‌హాసన్‌ గురించి శ్రుతి చెప్పిన విశేషాలు ఈ విధంగా... 

► మా చైల్డ్‌హుల్డ్‌ చాలా కంఫర్టబుల్‌. నాన్నగారు నన్ను, చెల్లి (అక్షరా హాసన్‌)ని  చెన్నైలో మంచి ప్రైవేట్‌ స్కూల్లో చదివించారు. ఆ తర్వాత అమెరికాలో బెస్ట్‌ కాలేజీలో చేర్చారు. మంచి ఫుడ్, మంచి బట్టలు, ఖరీదు గల కార్లు, మంచి ఇల్లు... ది బెస్ట్‌ ఇచ్చారు. 21ఏళ్లకే నేను హీరోయిన్‌ అయి, సంపాదించడం మొదలుపెట్టాను. నిజానికి నాన్న చాలా స్వేచ్ఛ ఇస్తారు. ఆయనతో ఏ విషయాన్నయినా చెప్పుకునేంత స్వేచ్ఛ మాకుంది. తండ్రి మీద ప్రేమతో పాటు చాలా గౌరవం కూడా ఉంటుంది కాబట్టి... ఆ గౌరవంతో మాకు మేముగా కొన్ని హద్దులు పెట్టుకుంటాం. మన నాన్న మనకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అయినప్పుడు ఆ కూతురికి అంతకన్నా కావాల్సినది ఏముంటుంది? ఆయన కేవలం తండ్రి మాత్రమే కాదు.. నా ఫేవరెట్‌ హ్యూమన్‌ కూడా.  

► ఎవరి దగ్గరైతే జీవితం గురించి చాలా విషయాలు నేర్చుకుంటామో, ఎవరైతే మనల్ని బాగా నవ్విస్తారో ఆ వ్యక్తే మన తండ్రి అయితే ఇక అదే పెద్ద ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదం దక్కి నందుకు నాకు ఆనందంగా ఉంది. ఎప్పటికీ నాకు ‘డియరస్ట్‌ డాడ్‌’గా ఉంటున్నందుకు మా నాన్నకి థ్యాంక్స్‌. ‘హ్యాపీ ఫాదర్స్‌ డే’.  

► బర్త్‌ డే, ఫాదర్స్‌ డే.. అంటూ ముందుగా ప్లాన్‌ చేసుకుని మా ఇంట్లో ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేయం. సో.. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా మా నాన్నకు శుభాకాంక్షలు చెబుతాను. మా నాన్నగారు సాధించిన విజయాలకు నేనెప్పటికీ గర్వపడుతుంటాను. ఇప్పటికీ ఆయన అదే ఎనర్జీతో కొనసాగుతున్నారు. ప్రొఫెషన్‌ అంటే అదే ప్యాషన్‌. ఒక మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు. మా నాన్న
పరంగా నేను గర్వించే విషయాల్లో ఇవి. జీవితం పట్ల ఆయనకు ఉన్న ప్యాషన్‌ నాకే కాదు... నాలాంటివారికెందరికో స్ఫూర్తి. మా నాన్నలా తమ ఇళ్లలో సమానత్వాన్ని పాటిస్తూ, ప్రోత్సహిస్తున్న గుడ్‌ ఫాదర్స్‌ అందరికీ ఈ ఫాదర్స్‌ డే సందర్భంగా శుభాకాంక్షలు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement