యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోన్న డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మూవీ సాంగ్‌

Shivani Rajashekar WWW Movie Lyrical Song Cross 1 Million Views In Youtube - Sakshi

ఆదిల్‌ అరున్‌, శివాని రాజాశేఖర్‌ హీరోహీరోయిన్లుగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న  తాజా చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’. రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ‘కన్నులు చెదిరే’ లిరికల్ వీడియో సాంగ్‌ను నటుడు అడివి శేష్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రేండ్‌ అవుతోంది. ‘కన్నులు చెదిరే అందాన్నె వెన్నెల తెరపై చూశానే.. కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే...’ అంటూ సాగే ఈ లవ్‌ మెలోడి సాంగ్‌ సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కాగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లైన ఈ పాట శ్రోత‌ల‌ని ఆక‌ట్టుకుంటూ యూట్యూజ్‌లో 1 మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌ని సాధించింది. అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ , యాజిన్‌ నిజార్‌ గాత్రం.. సైమన్‌ కె కింగ్‌ బాణీ అన్నీ కూడా చక్కగా కుదిరాయి. ఇప్పటికే ఈ వీడియో సాంగ్‌ విడదల కార్యక్రమంలో అడవి శేష్‌ మాట్లాడుతూ పాట అద్భుతంగా ఉందంటూ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ టీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. తాజాగా తమ పాట ఇంతటి ఆదరణను దక్కించుకున్నందుకు  చిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల  మాట్లాడుతూ.. ‘మా రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో రూపొందుతోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. అలాగే ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు మూవీ. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, నైలున‌ది, లాక్‌డౌన్ ర్యాప్‌ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా `మేజ‌ర్` అడివిశేష్‌ రిలీజ్ చేసిన `కన్నులు చెదిరే..` లిరిక‌ల్ వీడియో సాంగ్  యూట్యూబ్‌లో 1 మిలియ‌న్‌కి పైగా ఆర్గానిక్ వ్యూస్‌ని సొంతం చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సంద‌ర్భంగా ఈ పాట విడుద‌ల చేసిన అడివిశేస్‌కు, ఆదిత్య మ్యూజిక్ వారికి మా రామంత్ర క్రియేష‌న్స్ త‌ర‌పున ప్ర‌త్యేక‌మైన ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం’ అంటు ఆనందం వ్యక్తం చేశారు.  అలాగే ప్రస్తుతం మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని,  ఈ కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ చక్కగా నటించారని, గుహ‌న్ అద్బుతంగా తెర‌కెక్కించిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సమన్‌ కె. కింగ్‌ సంగీతం అందించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top